♻️ *యేసు క్రీస్తు శరీరధారి అగుటకు కారణములు .*
*1. పాపులను రక్షించుటకు క్రీస్తు ఈ లోకమునకు వచ్చెను.*
1తిమోతికి 1: 15
పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్య మైనదియునైయున్నది.
*2. నశించిన దానిని వెదకి రక్షించుటకు.*
లూకా 19: 10
నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను.
*3. ధర్మశాస్త్రము నెరవేర్చుటకు*
మత్తయి 5: 17
ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు.
*4. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు*
యోహాను 18: 37-38
అందుకు పిలాతునీవు రాజువా? అని ఆయనను అడుగగా యేసునీవన్నట్టు నేను రాజునే; సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని; సత్యసంబంధియైన ప్రతివాడును నా మాట వినుననెను.అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి? అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్లి అతనియందు ఏ దోషమును నాకు కనబడలేదు;
*5. పరిచారము చేయుటకు*
మార్కు 10: 45
మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను.
*6. విమోచన క్రయధనముగ తన ప్రాణము నిచ్చుటకు*
మత్తయి 20: 28
ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను.
*7. అపవాది క్రియలను లయపరచుటకు*
1యోహాను 3: 8
అపవాది(సాతాను) మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి; అపవాది(సాతాను) యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను.
*8. లోకపాపమును మోసికొనిపోవుటకు*
యోహాను 1: 29
మరువాడు యోహాను యేసు తనయొద్దకు రాగా చూచి ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల.
*9. సమస్తమును తెలియజేయుటకు*
యోహాను 4: 25-26
ఆ స్త్రీ ఆయనతో క్రీస్తన బడిన మెస్సీయ వచ్చునని నేనెరుగుదును; ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా
యేసునీతో మాటలాడు చున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను.
*10. దైవరాజ్య సువార్తను ప్రకటించుటకు*
లూకా 4: 43
ఆయననేనితర పట్టణములలోను దేవుని రాజ్యసువార్తను ప్రకటింపవలెను; ఇందునిమిత్తమే నేను పంపబడితినని వారితో చెప్పెను.
*11. లోకమును రక్షించుటకు*
యోహాను 3: 17
లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు.
*12. తండ్రి చిత్తము నెరవేర్చుటకు*
యోహాను 6: 39
నా యిష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని.
*13. గొర్రెలకు సమృద్ధిగా జీవము కలుగుటకు*
యోహాను 10: 10
దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరిదేనికిని రాడు; గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృధ్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
*14. మంచి కాపరిగా తన ప్రాణము పెట్టుటకు*
యోహాను 10: 11-18
నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱెలకొరకు తన ప్రాణము పెట్టును.
*15. శిష్యులను సత్యమందు ప్రతిష్ఠ చేయుటకు*
యోహాను 17: 18-19
నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని.వారును సత్యమందు ప్రతిష్ఠ చేయ బడునట్లు వారికొరకై నన్ను ప్రతిష్ఠ చేసికొనుచున్నాను.
*16. భూమి మీద అగ్ని వేయుటకు*
లూకా 12: 49
నేను భూమిమీద అగ్నివేయ వచ్చితిని; అది ఇదివరకే రగులుకొని మండవలెనని యెంతో కోరుచున్నాను.
*17. అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు*
హెబ్రీయులకు 2: 14-15
కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని(అనగా-సాతాను) మరణముద్వారా నశింపజేయుటకును,
హెబ్రీయులకు 2: 15
జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను.
*18. ధర్మశాస్త్రమునకు లోబడినవారిని విమోచించుటకు*
గలతియులకు 4: 4-5
అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను;ఆయన స్త్రీయందు పుట్టి,
మనము దత్తపుత్రులము(స్వీకృతపుత్రులము) కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి యున్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను.
*19. మధ్యవర్తిత్వము జరుపుటకు*
1తిమోతికి 2: 5
దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు.
హెబ్రీయులకు 9: 15
ఈ హేతువుచేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధములనుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్తనిబంధనకు మధ్యవర్తి యైయున్నాడు.
*20. ధర్మశాస్త్ర శిక్ష నుండి తప్పించుటకు*
రోమీయులకు 8: 1
కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు.
*21. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చుటకు*
రోమీయులకు 8: 3-4
శరీరము ననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతివిధి నెరవేర్చబడవలెనని పాప పరిహారమునిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను.
*22. ఆదాము దోషమును తీసివేయుటకు*
(1కొరిందీ15:20,22,45,49)
*23. మరల వచ్చి మనలను కొనిపోవుటకు*
యోహాను 14: 3
నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును.
*24. లేఖనముల ప్రకారము లేఖనములు నెరవేర్చుటకు, ప్రవక్తల ప్రవచనములను నెరవేర్చుటకు ప్రభువు పరమును వీడి, ఈ లోకమునకు ఏతెంచెను.*
1కోరింథీయులకు 15: 3-4
నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందెను, సమాధి చేయబడెను,లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను.
*హల్లెలూయ...*
*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*
*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
➖➖➖➖➖➖➖➖
No comments:
Post a Comment