Monday, 30 July 2018

FACTS ABOUT CREATION

సృష్టి గురించి 

            ప్రస్తుతము వరకు శాస్త్రజ్ఞుల లెక్కల ప్రకారము కనుగొనబడినవి. కనుగోనబడవలసినవి ఇంకా కొన్ని           వేల సంఖ్యలో ఉండవచ్చు అని అంచనా.
◾వెన్నెముక కలిగిన జీవులు – 80,500
◾వెన్నెముకలేని జీవులు – 67,55,830
◾మొక్కల జాతులు – 4,00,000
◾సౌర కుటుంబము యొక్క అడ్డు కొలత 6 బిలియన్‌ మైళ్లు
◾మన పాల పుంత/నక్షత్ర మండలము లో సుమారుగా 400 బిలియన్‌ నక్షత్రాలు కలవు.
◾మనకు దగ్గరగా ఉన్న నక్షత్రము ఆల్ఫా సెంటారి, 26 ట్రిలియన్‌ మైళ్లు లేదా 4.5 కాంతి సంవత్సరాల దూరము
◾కాంతి సెకనుకు సుమారుగా 1,86,324 మైళ్లు మరియు సంవత్సరానికి 5.8 ట్రిలియన్‌ మైళ్లు ప్రయాణిస్తుంది.
◾కాంతి ఉత్తర దిక్కు నక్షత్రము నుండి భూమికి చేరటానికి 400 సంవత్సరాలు పడుతుంది
◾మనకు దగ్గరగా ఉన్న నక్షత్ర మండలము గ్రేట్‌ నెబులా నుండి 7,00,000 సంవత్సరాలు పడుతుంది
◾మనం టెలిస్కొపు తోటి చూడ దగిన సుదూరమైన నక్షత్ర మండలము నుండి 500 మిలియన్‌ సంవత్సరాలు పడుతుంది
◾మన పాల పుంత లాంటి నక్షత్ర మండలములు సుమారు 100 బిలియన్‌ ఉండవచ్చని శాత్రవేత్తల అంచనా.
◾మొత్తం 100 బిలియన్‌ నక్షత్ర మండలముల లో 70 సెక్స్టిలియన్‌ నక్షత్రాలు ఉండవచ్చని అంచనా.
◾భూమి యొక్క చుట్టు కొలత 25,000 మైళ్లు. మిగతా గ్రహాలతో పోల్చితే భూమి చిన్నది క్రింద లెక్క.
◾సూర్యుడు భూమి కన్నా 1.3 మిలియన్‌ రెట్లు పెద్ద.
◾గురు గ్రహం భూమి కన్నా 1400 రెట్లు పెద్దది
◾శని గ్రహం భూమి కన్నా 1100 రెట్లు పెద్దది
◾యురేనస్‌ భూమి కన్నా 800 రెట్లు పెద్దది
◾సూర్యుడు భూమి నుంచి 93 మైళ్ల దూరం లో ఉన్నాడు. మిగతా నక్షత్రాలతో పోల్చుకుంటే 3,00,000 రెట్లు దగ్గర
◾సూర్యుడి యొక్క అడ్డు కొలత 8,65,400 మైళ్లు. చుట్టు కొలత 2,77,7000 మైళ్లు.
◾ఆంటేర్స్‌ నక్షత్రం యొక్క అడ్డు కొలత 390 మిలియన్‌ మైళ్లు.
◾ఎప్సిలాన్‌ అరిగే నక్షత్రం యెక్క అడ్డు కొలత 2.4 బిలియన్‌ మైళ్లు.
◾మన సౌర కుటుంబంలో 9 పెద్ద గ్రహాలు, 31 ఉపగ్రహాలు ఉన్నాయి.
◾సూర్యుని యెక్క ఉపరితలం మీద ఉష్ణోగ్రత 12,000 డిగ్రీల ఫారెన్‌ హీట్‌
◾సూర్యుని యెక్క మద్యలో 4,00,00,000 (4 కోట్లు) డిగ్రీల ఫారెన్‌ హీట్‌
◾సూర్యుని యెక్క ఉపరితలం మీద నుంచి రవ్వలు 25,000 నుండి 5,00,000 మైళ్ల ఎత్తుకు లేస్తాయి
◾సూర్యుడు తన కక్ష్య చుట్టూ ఒక సారి తిరగటానికి 25 రోజులు పడుతుంది.
◾సూర్యుని యొక్క వేగం సెకనుకు 12 మైళ్లు
◾చంద్రుడు భూమి నుంచి 221000 నుండి 253000 మైళ్ల దూరంలో ఉన్నాడు.
◾చంద్రుడి గురించి వాక్యములో 62 సార్లు చెప్పబడింది
◾ప్రతి సంవత్సరం 12 తోక చుక్కలు కనబడతాయి. అవి మరలా భూమిని చేరటానికి 1000 సంవత్సరాలు పడుతుంది. కొన్ని తోక చుక్కలు భూమి కన్నా పెద్దగా ఉంటాయి. 1811 అనే తోక చుక్క తల యొక్క అడ్డు కొలత 1,12,000 మైళ్లు. తోక పొడుగు 112,000,000 మైళ్లు
◾కాంతి మన పాలపుంత ఒక చివరి నుంచి మరొక చివరకు వెళ్లటానికి 1,00,000 సంవత్సరముల కాలము పడుతుంది.
◾భూమికి సూర్యునికి మధ్యఉన్న దూరమును ఒక పేపరు యొక్క మందముతో పోల్చుకుంటే మనకు అతి దగ్గరగా ఉన్న నక్షత్రమునకు ఉన్న దూరము చూపించటానికి 71 అడుగుల ఎత్తు ఉన్న పేపరు కావాలి
◾మన పాలపుంత యొక్క వ్యాసము చూపించటానికి 500 కి.మీ. ఎత్తు ఉన్న పేపర్లు అవసరము
◾మనకు తెలిసిన విశ్వము యొక్క అంచుకు చేరటానికి 50 మిలియన్ కి.మీ. ఎత్తు ఉన్న పేపర్లు అవసరము
◾సూర్యుడు ఒకవేళ ఖాళీగా ఉన్నట్లయితే 13,00,000 భూములను అందులో పెట్టవచ్చు
ఆంటేరు అనే నక్షత్రములో 64 మిలియన్ సూర్యులను పెట్టవచ్చు
హెర్కులస్ అనే నక్షత్ర మండలములోని ఒక నక్షత్రములో100 మిలియన్ ఆంటేరు నక్షత్రములను పెట్టవచ్చు
ఎప్సిలోన్ అనే నక్షత్రములో హెర్కులస్ అనే నక్షత్ర మండలములోని ఒక నక్షత్రము లాంటివి కొన్ని మిలియన్ నక్షత్రాలు పెట్టవచ్చు
◾భూమి తన కక్ష్య చుట్టూ గంటకు 1610 కి.మీ. వేగముతో తిరుగుతుంది
◾భూమి తన చుట్టూ తాను గంటకు 1000 మైళ్ల వేగంతో తిరుగుతుంది
◾సూర్యుని చుట్టూ భూమి తిరిగే వేగం గంటకు 66,700 మైళ్లు అనగా రోజుకు 1.6 మిలియన్‌ మైళ్లు
◾భూమి మన పాలపుంత చుట్టూ గంటకు 7,74,095 కి.మీ. వేగముతో తిరుగుతుంది
◾భూమి సూర్యుని చేత మన పాలపుంతలో గంటకు 1,02,999 కి.మీ. వేగముతో లాగుతుంది
◾భూమి మన విశ్వము చుట్టూ 21,72,614 కి.మీ వేగముతో తిరుగుతుంది
◾మన పాలపుంతలోని నక్షత్రములను సెకనుకు ఒకటి చొప్పున లెక్కించితే మొత్తము నక్షత్రములను లెక్కించటానికి 2500 సంవత్సరముల కాలము పడుతుంది
◾సృష్టిలోని అతి చిన్న వస్తువు అణువు
◾ఒక బాల్ పెన్ను కొనలో ఉండే అణువుల మొత్తము ఒక చోట నుండి ఇంకో చోటికి తీసుకువెళ్లటానికి 4గురు సైనికులకు ఒకరు ఒక అణువు మోస్తే 20,000 సంవత్సరముల కాలము పడుతుంది
◾ఒక అణువులో ప్రోటాన్లు, ఎలెక్ట్రాన్లు ఉంటాయి.
◾ఒక ఇంచులొ 25 ట్రిలియన్ ప్రోటాన్లు ఉంటాయి
◾ఒక ఇంచు ఇత్తడి వైరులో ఉండే ప్రోటాన్ల సంఖ్య ప్రపంచములోని అన్ని సముద్రములలో ఉన్న నీటి బిందువుల సంఖ్యతో సమానము
◾ప్రతి 2 ప్రోటాన్ల మద్య 18 కిలోల శక్తి దాగి ఉంటుంది
◾ఈ శక్తి యొక్క బలము గురుత్వాకర్షణ శక్తి కన్నా 1 పక్కన 38 సున్నాల అంత ఎక్కువగా ఉంటుంది
◾ఒక చుక్క ఆయిలులో ఉన్న శక్తి మొత్తాన్ని వినియోగిస్తే భూమి చుట్టూ 400 సార్లు తిరగటానికి అవసరమైన శక్తి వస్తుంది
◾ఇన్ స్టీన్ ప్రకారము ఒక ఔన్సు నీటి నుండి విడుదల అయ్యే శక్తి 2,00,000 మిలియన్ కేజీల బరువును భూమిమీద నుండి 1.6 కి.మీ. ఎత్తుకు ఎత్తటానికి సమానము అవుతుంది
◾నక్షత్రములు శక్తిని ద్రవ్యరాశిగా మార్చుటద్వారా తయారు చేయబడతాయి
1 గ్రాము ద్రవ్యరాశి చేయటానికి 10 మిలియన్ కిలోవాట్ల శక్తి అవసరము
◾క్వాసర్స్ అనే నక్షత్రములు విశ్వములో చిన్న పరిమాణములో ఉండి కాంతి జనకాలుగా పనిచేస్తాయి. వీటి నుండి 10 ట్రిలియన్ నక్షత్రముల కన్నా ఎక్కువ శక్తి ఉత్పత్తి అవుతుంది
◾సూపరునోవాలు తమ మామూలు ప్రకాశము కన్నా10 మిలియన్ రెట్ల ప్రకాశమును ఇవ్వగలవు
◾న్యూట్రాను నక్షత్రములు ఎక్కువ బరువైన ద్రవ్యరాశి కలిగి ఉంటాయి. 1 స్పూను ద్రవ్యరాశి భూమి మీద 1 బిలియన్ టన్నులతో సమానము

◾కొలతలు

1 మైలు = 1.6 కిలోమీటర్లు
1 లక్ష = 100 వేలు
1 మిలియన్‌ = 10 లక్షలు
1 కోటి = 100 లక్షలు లేదా 10 మిలియన్‌
1 బిలియన్‌ = 10 కోట్లు
1 ట్రిలియన్‌ = 100 కోట్లు లేదా 10 బిలియన్‌
1 సెక్స్టిలియన్‌ = 1 పక్కన 22 సున్నాలు (10000000000000000000000)

INTRESTING FACTS ABOUT HUMAN BODY

మానవశరీరము గురించి 

◾మానవుని యొక్క మెదడులో 10 కోట్ల కణములు ఉన్నవి.
◾మానవుని కంటిలో 13 కోట్ల చిన్న చిన్న రాడ్ కణములు, 70 లక్షల కోన్ కణములు, 3 లక్షల నరములతో కలుపబడి ఉన్నవి. ఒక కన్ను తయారు చేయుటకు 2 లక్షల టెలివిజను ట్రాన్స్ మీటర్లు, 2 లక్షల టెలివిజను రిసీవర్లు కావలెను
◾హార్మోనియం లో 45 కీలు, పియానోలో 88 కీలు, మానవుని చెవిలో 15,000 కీలు ఉన్నాయి
◾మానవుని శరీరములో 1,00,000 మైళ్ళ పొడవైన రక్తనాళములు కలవు. ప్రతి క్షణమునకు 20 లక్షల కణములు తయారగుచున్నవి
◾మానవుని హృదయము నిముషమునకు 72 సార్లు, రోజుకు ఇంచు మించు 1,00,000 సార్లు, సంవత్సరమునకు 4 కోట్ల సార్లు ఎటువంటి విశ్రాంతి లేకుండా కొట్టుకొనుచున్నది
◾మానవుని జీవిత కాలములో హృదయము లోని ఒక చిన్న కండరము 30 కోట్ల సార్లు సంకోచ వ్యాకోచములు చేయును
◾మానవుని శరీరములోని రసాయన పదార్ధములన్నీ కొనాలి అంటే 2 కోట్ల 70 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మనిషి చనిపోయాక అమ్మితే 6 రూపాయల 45 పైసలు వచ్చును
◾మనిషి నవ్వటానికి శరీరములో 17 కండరములు కోపపడటానికి 43 కండరములు పనిచేస్తాయి
◾మనిషి చర్మములొ 46 మైళ్ళ పొడవైన నాడులు ఉన్నాయి
◾మనిషి శరీరములోని రక్తనాళములు అన్నీ ఒకదానికి ఒకటి జోడిస్తే 1,00,000 మైళ్ళ పొడవు ఉండును
◾మానవుని నాలుక పైన రుచిని తెలుపటానికి 3000 రకాల బుడిపెలు ఉంటాయి
◾ఆరోగ్యము కల మనిషి ఒకరోజులో 23000 సార్లు శ్వాస పీల్చును
◾మనిషి చేతివేళ్ళ చర్మము మీద ప్రతి చదరపు అంగుళానికి 3000 స్వేద గ్రంధులు ఉన్నాయి
◾మనిషి తలపై సగటున 1,00,000 వెంట్రుకలు ఉంటాయి
◾మానవుని పంటి దవడ 276 కేజీ ల కంటే ఎక్కువ బరువు ఆపగలదు
◾మానవుని శరీరములో 206 ఎముకలు కలవు
◾మనిషి జీవిత కాలములో 16,000 గాలన్ల నీరు తాగుతాడు
◾మనిషి నోటిలో రోజుకు 2 నుండి 3 పాయింట్ల జీర్ణరసము ఏర్పడుతుంది
◾మనిషి జీవిత కాలములో గుండె 100 ఈతకోలనులు నింపగలిగిన రక్తము పంపు చేస్తుంది
◾మానవుని శరీరములో నాలుకయే బలమైన కండరము
◾మానవుని శరీరములో 100 ట్రిలియను కణములు ఉంటాయి
◾మానవుని మెదడులో 80% నీరు ఉంటుంది
◾మానవుని మెదడుకు నొప్పి తెలియదు
◾మానవుని శరీర బరువులో ఎముకుల వంతు 14% ఉంటుంది
◾మానవుని వ్రేళ్ల కొనలకు శరీర బరువును మొత్తము ఆపగల శక్తి ఉంటుంది
◾మానవుని ఎముకలు బయటికి గట్టిగాను లోపల మెత్తగాను ఉంటాయి. వీటిలో 75% నీరు ఉంటుంది
◾తుమ్ము గంటకు 100 మైళ్ళ వేగముతో ప్రయాణిస్తుంది
◾చేతి వ్రేళ్ల గోళ్ళు కాలి వ్రేళ్ల గొల్ల కన్నా 4 రెట్లు తొందరగా పెరుగును
◾స్త్రీ గుండె పురుషుని గుండె కన్నా ఎక్కువ వేగముగా కొట్టుకుంటుంది.
◾స్త్రీలు పురుషుల కన్నా ఎక్కువ సార్లు కనురెప్పలు అర్పుతారు
◾రక్తము నీరు కన్నా కుడా 6 రెట్లు చిక్కగా ఉంటుంది
◾మానవుని మూత్రపిండములు నిముషమునకు 1.3 లీటర్ల రక్తమును శుద్ది చేయును. రోజుకు 1.4 లీటర్ల ముత్రమును విసర్జించును
◾స్త్రీ శరీరములో 4.5 లీటర్ల రక్తము, పురుషుని శరీరములో 5.6 లీటర్ల రక్తము ఉంటాయి
◾మానవుని గుండె రక్తమును 9 మీటర్ల ఎత్తు వరకు చిమ్మకలిగిన శక్తి కలిగి ఉంటుంది
◾మానవుని శరీరములో రక్త ప్రసరణ జరగని ఒకే ఒక్క ప్రాంతము కంటిలోని కరోన
◾ఒక ఎర్ర రక్త కణమునకు శరీరము మొత్తము చుట్టి రావటానికి 20 సెకన్ల సమయము పడుతుంది
◾రక్తములోని ప్రతి చుక్క కుడా శరీరము చేత రోజుకి 300 సార్లు శుద్ది చేయబడుతుంది
◾మానవుని జుత్తు, చేతి గోళ్ళు చనిపోయిన తరువాత కుడా పెరుగుతాయి
◾మనిషి గొంతులో ఉండే హ్యోఇడ్ అనే ఎముక శరీరములోని వేరే ఏ ఎముకతోను అతుకబడి ఉండదు
◾మనిషి పుర్రె 10 సంవత్సరములకు ఒకసారి మారుతూ ఉంటుంది
◾మనిషి మెదడులోని కుడి బాగము శరీరములోని ఎడమ బాగమును, మెదడులోని ఎడమ బాగము శరీరములోని కుడి బాగమును అదుపు చేయును
◾మనిషి ఏమి తినకుండా 20 రోజులు, ఏమి త్రాగకుండా 2 రోజులు బ్రతుకును
◾మనిషి ముఖములో 14 ఎముకలు ఉండును
◾మానవుని నాడి నిముషమునకు 70 సార్లు కొట్టుకొనును
◾ప్రతి 7 రోజులకు ఒకసారి శరీరములోని ఎర్ర రక్త కణములలో సగము మార్పిడి చేయబడును
◾మనిషి దగ్గినపుడు గాలి శబ్ద వేగముతో ప్రయాణము చేయును
◾ఆహారము నోటిలో నుండి పొట్ట లోపలి చేరటానికి 7 సెకన్ల సమయము పడుతుంది
◾మనిషి శరీరములో 75% నీరు ఉంటుంది
◾మనిషి కంటితో 2.4 మిలియను కాంతి సంవత్సరముల దూరము (140,000,000,000,000,000,000 మైళ్లు) చూడవచ్చు.
◾సృష్టిలోని ప్రతి జీవి కొన్ని మిలియన్ కణాల కలయిక చేత చేయబడినది
◾మానవుని శరీరములో 75 ట్రిలియన్ కణాలు ఉంటాయి
◾ఒక్కో కణములో 200 ట్రిలియన్ గుంపుల అణువులు ఉంటాయి
◾ఒక్కో అణుగుంపులొ DNA కోడ్ ఉంటుంది. దీని పొడుగు 6 అడుగుల ఎత్తు
◾మానవ శరీరములోని DNA కోడ్ యొక్క మొత్తము పొడుగు భూమి నుంచి సూర్యునికి ఉన్న దూరాన్ని 400 సార్లు తిరిగినంత ఉంటుంది
◾ఒక్కో DNA కోడ్ లొ ఉండే సమాచారాన్ని ఇంగ్లీషులోకి తర్జుమా చేస్తే 1000 సంచిక నిఘంటువు అవుతుంది
◾ఒక్కో అణువు 50 అణువులుగా విడిపోయే సామర్ధ్యము కలిగి ఉంటుంది
◾మానవ శరీరములోని అణువులు అన్నీ ఇలా విడిపోతే వాటి బరువు 80 ట్రిలియన్ టన్నులు ఉంటుంది

Interesting facts about Genesis

ఆదికాండములోని ఆసక్తికరమైన  విషయాలు 

పేరు - ఆదికాండము 
ఇంగ్లీషు పేరు - జెనెసిస్ (GENESIS)
గ్రంధకర్త - మోషే 
బాగము - పాత నిబంధన 
వర్గము - ధర్మశాస్త్రము 
రచన కాలము - క్రీ.పూ. 1450 – 1410 
చరిత్ర కాలము - ఆది నుండి క్రీ.పూ. 1806 వరకు 
వ్రాయబడిన స్థలము - అరణ్యములో. (ప్రస్తుతము అరేబియా గా పిలువబడుచున్న ప్రాంతము) 
ఎవరికొరకు వ్రాయబడెను - ఇశ్రాయేలీయుల కొరకు 
గణాంకములు 
50 అద్యాయములు
1,533 వచనములు
38,267 పదములు
1,156 వచనములు “మరియు” అనే పదముతో మొదలవును
1,385 వచనములు చరిత్ర
149 ప్రశ్నలు
56 ప్రవచనములు
123 వచనముల ప్రవచనము నెరవేర్చబడినది
23 వచనముల ప్రవచనము నెరవెర్చబడవలసి ఉన్నది
◾చిన్న అధ్యాయము 16.
◾పెద్ద అధ్యాయము 24.
16 వ అద్యాయములో 16 వచనములు కలవు
32 వ అద్యాయములో 32 వచనములు కలవు
106 ఆజ్ఞలు
71 వాగ్దానములు
326 జరగబోవు విషయములు కలవు
◾ఆదికాండము లో దేవుని దగ్గర నుంచి 95 విభిన్నమైన సందేశములు కలవు
◾ఆదికాండము లో 2350 సంవత్సరముల చరిత్ర కలదు
◾మొదటి 11 అద్యాయములలో 2000 సంవత్సరముల చరిత్ర
◾చివరి 39 అద్యాయములలో 350 సంవత్సరముల చరిత్ర

నోవహు ఓడ వివరములు    

450 అడుగుల పొడవు
75 అడుగుల వెడల్పు
45 అడుగుల ఎత్తు
97,700 చదరపు అడుగుల వైశాల్యము
14,000 టన్నుల పైన బరువు
520 గూడ్సు రైలు పెట్టెలలో పట్టే సామాగ్రి ఇందులో ఉంచవచ్చు
1884 వరకు ప్రపంచము లో ఇదే పెద్ద ఓడ

అబ్రహాము గురించి    


◾అబ్రహాము ప్రయాణము చేసిన మొత్తము దూరము సుమారు 1500 మైళ్లు (2414 కిలోమీటర్లు)
◾అబ్రహాము గురించి బైబిలు లో 308 సార్లు చెప్పబడినది.
◾234 సార్లు పాత నిబంధనలో, 74 సార్లు క్రొత్త నిబంధనలో చెప్పబడినది
◾బైబిలులోని 66 పుస్తకములలో 27 పుస్తకములలో అబ్రహాము గురించి చెప్పబడినది
◾16 పుస్తకములు పాత నిబంధనలో, 11 పుస్తకములు క్రొత్త నిబంధనలో
◾ఉర్ నకు హారానుకు మద్య ఉన్న దూరము సుమారు 700 మైళ్లు (1127 కిలోమీటర్లు)
◾ఉర్ నకు బబులోనుకు మద్య దూరము 50 మైళ్లు (81 కిలోమీటర్లు)
◾హారానునకు షెకెమునకు మద్య దూరము 400 మైళ్లు (644 కిలోమీటర్లు)
◾షెకెమునకు బెతేలునకు మద్య దూరము 20 మైళ్లు (32 కిలోమీటర్లు)
◾బెతేలునకు ఇగుప్తునకు మద్య దూరము 225 మైళ్లు (362 కిలోమీటర్లు)
◾బెతేలునకు మమ్రేకు మద్య దూరము 35 మైళ్లు (56 కిలోమీటర్లు)
◾మమ్రేకు హోబాకు మద్య దూరము 160 మైళ్లు (258 కిలోమీటర్లు)
◾షెకెము యెరూషలేమునకు 40 మైళ్ల దూరములో ఉన్నది (64 కిలోమీటర్లు)
◾అబ్రహాము నలుగురు (4) రాజుల సైన్యమును 318 మందితో జయించినాడు
◾ధర్మశాస్త్రములో చెప్పబడటానికి 400 సంవత్సరముల ముందే అబ్రహాము దశమబాగము చెల్లించినాడు
◾మొదటిసారి యెరూషలేము పేరు 14వ అధ్యాయములో చూడగలము (సాలేము)
◾యాజకుడు అనే పదము 14వ అధ్యాయములో మొదటిసారి కనిపించును
◾ప్రభురాత్రి సంస్కారము మొదటిసారి 14వ అధ్యాయములో చూడగలముఅమోరీయులు అబ్రహాము కనానుకు రావటానికి ముందు 400 సంవత్సరముల నుండి అక్కడ నివాసము ఉండిరి.
◾దేవుడు వారికి తీర్పు తీర్చక ముందు మరియొక 400 సంవత్సరముల అవకాశము దయచేసెను.
◾అబ్రహాము సంతానము పరాయి దేశములో 400 సంవత్సరములు దాసులుగా ఉంటారు అని దేవుడు చెప్పినా కాని, మోషే తొందరపాటు వలన వారు 430 సంవత్సరములు ఉండిరి
◾అబ్రహాము హారాను నుండి బయలుదేరినపుడు 75 సంవత్సరముల వయస్సు కలవాడు
◾హగరు ఇష్మాయేలును కనినపుడు 86 సంవత్సరముల వయస్సు కలవాడు
◾దేవుడు ఇస్సాకు గురించి వాగ్ధానము చేసినపుడు 99 సంవత్సరముల వయస్సు కలవాడు
◾శారా ఇస్సాకును కనినపుడు 100 సంవత్సరముల వయస్సు కలవాడు
◾అబ్రహాము మరణించినపుడు 175 సంవత్సరముల వయస్సు కలవాడు
◾అబ్రహాము జీవితములో ముఖ్యమైన ప్రదేశములు 14
◾అబ్రహాము హేతు కుమారుల యెద్ద నుండి శ్మశానభూమిని 400 తులముల వెండికి కొనెను
◾అబ్రహామునకు పుట్టిన కుమారులు మొత్తము 8 మంది (ఇస్సాకు + ఇష్మాయేలు + కెతూరా కనినవారు గురు)
◾హారాను నుండి బయలుదేరినప్పుడు శారా వయస్సు 65 సంవత్సరములు
◾శారా ఇస్సాకును కనినపుడు ఆమె వయస్సు 90 సంవత్సరములు
◾శారా బ్రతికిన కాలము 127 సంవత్సరములు

పితరుల వయస్సు 
◾ఆదాము 930 సంవత్సరములు
◾షేతు 912 సంవత్సరములు
◾ఎనోషు 905 సంవత్సరములు
◾కేయినాను 910 సంవత్సరములు
◾మహాలలేలు 895 సంవత్సరములు
◾యెరెదు 962 సంవత్సరములు
◾హనోకు 365 సంవత్సరములు
◾మెతూషెల 969 సంవత్సరములు
◾లెమెకు 777 సంవత్సరములు
◾నోవహు 950 సంవత్సరములు
◾షేము 600 సంవత్సరములు


Tuesday, 17 July 2018

IS JESUS GOD? HERE IS THE ANSWER FOR YOU.


యేసు దేవుడు



ఒకవేళ యేసయ్య దేవుడు కాకపోతే, క్రింది వాటిని వివరించండి.
1) హెబ్రియులకు 1:8 లో సాక్షాతు యెహోవా దేవుడు యేసు ప్రభువును దేవా అని ఎందుకు పిలిచాడు?
2) యోహాను 20:28 లో యేసయ్య ను నా దేవా అని ఎందుకు తోమా పిలిచాడు ?
3) శారిరధారి అయిన ఆ వాక్యమును యోహాను 1:1 లో ఆ వాక్యము దేవుడై వున్నాడు అని ఎందుకు వ్రాసాడు?

4) యేసయ్య దేవుడు కాకపోతే, బలవంతుడైన దేవుడు అని ఎలా పేరు పెట్టబడ్డారు ? యెషయ 9:6.
5) యేసయ్య దేవుడు కాకపోతే, దేవుని మహిమ యొక్క తేజస్సును, అయన తత్వం యొక్క మూర్తిమంతమునై వున్నాడు అనునది ఎలా సాధ్యమవును ? హెబ్రియులకు 1:3
6) దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు నందు నివసించుచున్నది అన్న మాటకు అర్ధం ఏమిటి ? కొలొస్సయులకు2:9
8) యేసయ్య దేవుడు కాకపోతే, సృష్టికర్తగా సర్వసృష్టిని ఎలా సృష్టించగలిగాడు? కొలొస్సయులకు 1:16, యోహను 1:3, హెబ్రియులకు 1:3,8,10,11,12.
7) యేసయ్య దేవుడు కాకపోతే, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము అయన ప్రత్యేక్షమగుచుండెను మీకా 5: 1-2 అని యేసయ్య నిత్యత్వం గురుంచి చెప్పబడిన వాక్యం ఎలా సాధ్యమవును ?
9) యేసయ్య దేవుడు కాకపోతే, మూడు రోజులలో మరణాన్ని జయించి తిరిగి లెగుస్తాను అని ఎలా చెప్పగలిగాడు? యోహాను 2;19-21
10) యేసయ్య దేవుడు కాకపోతే, మనలో అయన ఎలా నివసించగలడు ? కొలొస్సయులకు 1:27

11) యేసయ్య దేవుడు కాకపోతే, "నేనే " అన్న దైవిక మైన పేరును అధికార పూర్వకముగా ఎందుకు ప్రకటించెను? యోహను 8:58, నిర్గమ 3:14.

12) యోహాను 8:58 లో యేసు అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను అని యేసయ్య తన దైవత్వం గురుంచి చెప్పిన మాట ఏమిటి ?

13) యేసయ్య రక్తం ను దేవుని రక్తం అని ఎందుకు పిలిచారు? అపోస్తులుల కార్యములు 20:28

14) యేసయ్య దేవుడు కాకపోతే, సర్వం ఎరిగినవాడు అని ఎలా చెప్పగలం ? యోహను 21:17, యోహను16:30

15) యేసయ్య దేవుడు కాకపోతే, అందరిని ఎరిగిన వాడు అని ఎలా చెప్పగలం? యోహను 2:24

16) యేసయ్య దేవుడు కాకపోతే, అంతరింధ్రియములను, హృదయములను ఎలా పరిక్షించగలడు? ప్రకటన 2:23

17) యేసయ్య దేవుడు కాకపోతే,తండ్రిని ఘనపరిచి నట్టుగా కుమారుని ఘనపరచాలి అని యేసయ్య ఎలా చెప్పగలిగారు ? యోహను 5:23

18) యేసయ్య దేవుడు కాకపోతే, కుమారుడు తనకిష్టము వచ్చిన వారిని ఎలా బ్రతికించగలడు? యోహాను 5:21

19) యేసయ్య దేవుడు కాకపోతే, యేసయ్య సర్వవ్యాప్తి ఎలా అవ్వగలరు? మత్తయీ18:20; 28:20; యోహను 3:13

20) యేసయ్య దేవుడు కాకపోతే, యేసయ్య సర్వాధికారి, సర్వశక్తిగలవాడు ఎలా అవ్వగలరు? ఫిలిప్పి 3:21, ప్రకటన 1:8, హెబ్రియులకు 7:25

21) యేసు ప్రభువుకు వున్న పేర్లు లో నిత్యుడగు తండ్రి అన్న మాటకు అర్ధం ఏమిటి? యెషయ 9:6

22) ఇమ్మానుయేలు అనగ దేవుడు మనకు తోడు అని యేసయ్యకు పేరు ఎందుకు పెట్టారు ? మత్తయి 1:23, యెషయ7:14
23) యేసురక్తం ప్రతి పాపముల నుండి మనలను ఎలా పవిత్రులుగా చేయగలదు ? 1 యోహను1:7

24) మన పాపముల నుండి ఎలా రక్షించగలడు మత్తయి 1:21
25) మన పాపములు ఎలా క్షమించగలడు? కొలొస్సయులకు3:13, మార్కు 2:7,10

26) యేసయ్య దేవుడు కాకపోతే, నిత్య జీవాన్ని మనకు ఎలా ఇవ్వగలడు ? యోహను 10:27-28

27) ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము (నిర్గమ 20:10) అని వ్రాయబడి ఉండగా కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ఎలా ప్రభువై యున్నాడు ? ఆదికాండం 2:3, మత్తయి12:8

28) యేసయ్య దేవుడు కాకపోతే, యేసయ్య ఎందుకు ఇతరుల చేత ప్రార్ధించబడి, వేడుకోబడ్డారు? 1 కోరంధియులకు6:11, ఫిలిప్పియులకు 2:9, కొలొస్సయులకు 3:17, ప్రకటన19:16, 2తిమోతి2:19 యోహను14:13,16:23,24,26 ఎఫెసి 5:20

29) యేసయ్య దేవుడు కాకపోతే,ఎందుకు అరాధించబడ్డాడు ? మత్తయి 2:2,11;14:33; 28:9; యోహను 9:35-38, హెబ్రియులకు1:6, ప్రకటన 5:12

30) తన్ను దేవునితో సమానముగా చేసుకొనెను యోహాను 5:18, దేవుడనని చెప్పుకోనుచున్నావు యోహాను 10:33 అని యేసయ్య తన దైవత్వం గురుంచి చెప్పాడని ఎందుకు యోహాను వ్రాసాడు ?