యేసు దేవుడు
ఒకవేళ యేసయ్య దేవుడు కాకపోతే, క్రింది వాటిని వివరించండి.
1) హెబ్రియులకు 1:8 లో సాక్షాతు యెహోవా దేవుడు యేసు ప్రభువును దేవా అని ఎందుకు పిలిచాడు?
2) యోహాను 20:28 లో యేసయ్య ను నా దేవా అని ఎందుకు తోమా పిలిచాడు ?
3) శారిరధారి అయిన ఆ వాక్యమును యోహాను 1:1 లో ఆ వాక్యము దేవుడై వున్నాడు అని ఎందుకు వ్రాసాడు?
4) యేసయ్య దేవుడు కాకపోతే, బలవంతుడైన దేవుడు అని ఎలా పేరు పెట్టబడ్డారు ? యెషయ 9:6.
5) యేసయ్య దేవుడు కాకపోతే, దేవుని మహిమ యొక్క తేజస్సును, అయన తత్వం యొక్క మూర్తిమంతమునై వున్నాడు అనునది ఎలా సాధ్యమవును ? హెబ్రియులకు 1:3
6) దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు నందు నివసించుచున్నది అన్న మాటకు అర్ధం ఏమిటి ? కొలొస్సయులకు2:9
8) యేసయ్య దేవుడు కాకపోతే, సృష్టికర్తగా సర్వసృష్టిని ఎలా సృష్టించగలిగాడు? కొలొస్సయులకు 1:16, యోహను 1:3, హెబ్రియులకు 1:3,8,10,11,12.
7) యేసయ్య దేవుడు కాకపోతే, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము అయన ప్రత్యేక్షమగుచుండెను మీకా 5: 1-2 అని యేసయ్య నిత్యత్వం గురుంచి చెప్పబడిన వాక్యం ఎలా సాధ్యమవును ?
9) యేసయ్య దేవుడు కాకపోతే, మూడు రోజులలో మరణాన్ని జయించి తిరిగి లెగుస్తాను అని ఎలా చెప్పగలిగాడు? యోహాను 2;19-21
10) యేసయ్య దేవుడు కాకపోతే, మనలో అయన ఎలా నివసించగలడు ? కొలొస్సయులకు 1:27
12) యోహాను 8:58 లో యేసు అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను అని యేసయ్య తన దైవత్వం గురుంచి చెప్పిన మాట ఏమిటి ?
13) యేసయ్య రక్తం ను దేవుని రక్తం అని ఎందుకు పిలిచారు? అపోస్తులుల కార్యములు 20:28
15) యేసయ్య దేవుడు కాకపోతే, అందరిని ఎరిగిన వాడు అని ఎలా చెప్పగలం? యోహను 2:24
16) యేసయ్య దేవుడు కాకపోతే, అంతరింధ్రియములను, హృదయములను ఎలా పరిక్షించగలడు? ప్రకటన 2:23
17) యేసయ్య దేవుడు కాకపోతే,తండ్రిని ఘనపరిచి నట్టుగా కుమారుని ఘనపరచాలి అని యేసయ్య ఎలా చెప్పగలిగారు ? యోహను 5:23
18) యేసయ్య దేవుడు కాకపోతే, కుమారుడు తనకిష్టము వచ్చిన వారిని ఎలా బ్రతికించగలడు? యోహాను 5:21
21) యేసు ప్రభువుకు వున్న పేర్లు లో నిత్యుడగు తండ్రి అన్న మాటకు అర్ధం ఏమిటి? యెషయ 9:6
23) యేసురక్తం ప్రతి పాపముల నుండి మనలను ఎలా పవిత్రులుగా చేయగలదు ? 1 యోహను1:7
24) మన పాపముల నుండి ఎలా రక్షించగలడు మత్తయి 1:21
25) మన పాపములు ఎలా క్షమించగలడు? కొలొస్సయులకు3:13, మార్కు 2:7,10
26) యేసయ్య దేవుడు కాకపోతే, నిత్య జీవాన్ని మనకు ఎలా ఇవ్వగలడు ? యోహను 10:27-28
27) ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము (నిర్గమ 20:10) అని వ్రాయబడి ఉండగా కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ఎలా ప్రభువై యున్నాడు ? ఆదికాండం 2:3, మత్తయి12:8
No comments:
Post a Comment