Monday, 30 July 2018

Interesting facts about Genesis

ఆదికాండములోని ఆసక్తికరమైన  విషయాలు 

పేరు - ఆదికాండము 
ఇంగ్లీషు పేరు - జెనెసిస్ (GENESIS)
గ్రంధకర్త - మోషే 
బాగము - పాత నిబంధన 
వర్గము - ధర్మశాస్త్రము 
రచన కాలము - క్రీ.పూ. 1450 – 1410 
చరిత్ర కాలము - ఆది నుండి క్రీ.పూ. 1806 వరకు 
వ్రాయబడిన స్థలము - అరణ్యములో. (ప్రస్తుతము అరేబియా గా పిలువబడుచున్న ప్రాంతము) 
ఎవరికొరకు వ్రాయబడెను - ఇశ్రాయేలీయుల కొరకు 
గణాంకములు 
50 అద్యాయములు
1,533 వచనములు
38,267 పదములు
1,156 వచనములు “మరియు” అనే పదముతో మొదలవును
1,385 వచనములు చరిత్ర
149 ప్రశ్నలు
56 ప్రవచనములు
123 వచనముల ప్రవచనము నెరవేర్చబడినది
23 వచనముల ప్రవచనము నెరవెర్చబడవలసి ఉన్నది
◾చిన్న అధ్యాయము 16.
◾పెద్ద అధ్యాయము 24.
16 వ అద్యాయములో 16 వచనములు కలవు
32 వ అద్యాయములో 32 వచనములు కలవు
106 ఆజ్ఞలు
71 వాగ్దానములు
326 జరగబోవు విషయములు కలవు
◾ఆదికాండము లో దేవుని దగ్గర నుంచి 95 విభిన్నమైన సందేశములు కలవు
◾ఆదికాండము లో 2350 సంవత్సరముల చరిత్ర కలదు
◾మొదటి 11 అద్యాయములలో 2000 సంవత్సరముల చరిత్ర
◾చివరి 39 అద్యాయములలో 350 సంవత్సరముల చరిత్ర

నోవహు ఓడ వివరములు    

450 అడుగుల పొడవు
75 అడుగుల వెడల్పు
45 అడుగుల ఎత్తు
97,700 చదరపు అడుగుల వైశాల్యము
14,000 టన్నుల పైన బరువు
520 గూడ్సు రైలు పెట్టెలలో పట్టే సామాగ్రి ఇందులో ఉంచవచ్చు
1884 వరకు ప్రపంచము లో ఇదే పెద్ద ఓడ

అబ్రహాము గురించి    


◾అబ్రహాము ప్రయాణము చేసిన మొత్తము దూరము సుమారు 1500 మైళ్లు (2414 కిలోమీటర్లు)
◾అబ్రహాము గురించి బైబిలు లో 308 సార్లు చెప్పబడినది.
◾234 సార్లు పాత నిబంధనలో, 74 సార్లు క్రొత్త నిబంధనలో చెప్పబడినది
◾బైబిలులోని 66 పుస్తకములలో 27 పుస్తకములలో అబ్రహాము గురించి చెప్పబడినది
◾16 పుస్తకములు పాత నిబంధనలో, 11 పుస్తకములు క్రొత్త నిబంధనలో
◾ఉర్ నకు హారానుకు మద్య ఉన్న దూరము సుమారు 700 మైళ్లు (1127 కిలోమీటర్లు)
◾ఉర్ నకు బబులోనుకు మద్య దూరము 50 మైళ్లు (81 కిలోమీటర్లు)
◾హారానునకు షెకెమునకు మద్య దూరము 400 మైళ్లు (644 కిలోమీటర్లు)
◾షెకెమునకు బెతేలునకు మద్య దూరము 20 మైళ్లు (32 కిలోమీటర్లు)
◾బెతేలునకు ఇగుప్తునకు మద్య దూరము 225 మైళ్లు (362 కిలోమీటర్లు)
◾బెతేలునకు మమ్రేకు మద్య దూరము 35 మైళ్లు (56 కిలోమీటర్లు)
◾మమ్రేకు హోబాకు మద్య దూరము 160 మైళ్లు (258 కిలోమీటర్లు)
◾షెకెము యెరూషలేమునకు 40 మైళ్ల దూరములో ఉన్నది (64 కిలోమీటర్లు)
◾అబ్రహాము నలుగురు (4) రాజుల సైన్యమును 318 మందితో జయించినాడు
◾ధర్మశాస్త్రములో చెప్పబడటానికి 400 సంవత్సరముల ముందే అబ్రహాము దశమబాగము చెల్లించినాడు
◾మొదటిసారి యెరూషలేము పేరు 14వ అధ్యాయములో చూడగలము (సాలేము)
◾యాజకుడు అనే పదము 14వ అధ్యాయములో మొదటిసారి కనిపించును
◾ప్రభురాత్రి సంస్కారము మొదటిసారి 14వ అధ్యాయములో చూడగలముఅమోరీయులు అబ్రహాము కనానుకు రావటానికి ముందు 400 సంవత్సరముల నుండి అక్కడ నివాసము ఉండిరి.
◾దేవుడు వారికి తీర్పు తీర్చక ముందు మరియొక 400 సంవత్సరముల అవకాశము దయచేసెను.
◾అబ్రహాము సంతానము పరాయి దేశములో 400 సంవత్సరములు దాసులుగా ఉంటారు అని దేవుడు చెప్పినా కాని, మోషే తొందరపాటు వలన వారు 430 సంవత్సరములు ఉండిరి
◾అబ్రహాము హారాను నుండి బయలుదేరినపుడు 75 సంవత్సరముల వయస్సు కలవాడు
◾హగరు ఇష్మాయేలును కనినపుడు 86 సంవత్సరముల వయస్సు కలవాడు
◾దేవుడు ఇస్సాకు గురించి వాగ్ధానము చేసినపుడు 99 సంవత్సరముల వయస్సు కలవాడు
◾శారా ఇస్సాకును కనినపుడు 100 సంవత్సరముల వయస్సు కలవాడు
◾అబ్రహాము మరణించినపుడు 175 సంవత్సరముల వయస్సు కలవాడు
◾అబ్రహాము జీవితములో ముఖ్యమైన ప్రదేశములు 14
◾అబ్రహాము హేతు కుమారుల యెద్ద నుండి శ్మశానభూమిని 400 తులముల వెండికి కొనెను
◾అబ్రహామునకు పుట్టిన కుమారులు మొత్తము 8 మంది (ఇస్సాకు + ఇష్మాయేలు + కెతూరా కనినవారు గురు)
◾హారాను నుండి బయలుదేరినప్పుడు శారా వయస్సు 65 సంవత్సరములు
◾శారా ఇస్సాకును కనినపుడు ఆమె వయస్సు 90 సంవత్సరములు
◾శారా బ్రతికిన కాలము 127 సంవత్సరములు

పితరుల వయస్సు 
◾ఆదాము 930 సంవత్సరములు
◾షేతు 912 సంవత్సరములు
◾ఎనోషు 905 సంవత్సరములు
◾కేయినాను 910 సంవత్సరములు
◾మహాలలేలు 895 సంవత్సరములు
◾యెరెదు 962 సంవత్సరములు
◾హనోకు 365 సంవత్సరములు
◾మెతూషెల 969 సంవత్సరములు
◾లెమెకు 777 సంవత్సరములు
◾నోవహు 950 సంవత్సరములు
◾షేము 600 సంవత్సరములు


No comments:

Post a Comment