Tuesday, 7 August 2018

✳ *బైబిల్ ప్రకారము సృష్టి క్రమములో నాలుగో రోజు సూర్యుడు సృజింపబడ్డాడా...???

✳ *బైబిల్ ప్రకారము సృష్టి క్రమములో నాలుగో రోజు సూర్యుడు సృజింపబడ్డాడా...???...✍*

👉చాలా మంది బైబిల్ ని అర్ధం చేసుకోలేక తప్పుడు అర్ధాలు కల్పించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

ఇప్పటి క్రైస్తవులు చాలా మంది బైబిల్ ఒక పుస్తకము లాగానే చదువుచున్నారు
*కాని జ్ఞానం ఇచ్చే గ్రంధంలా చూడటం లేదు.*
👉 బైబిల్ జ్ఞాన గ్రంధం అయినప్పటికి దానిని చదివినంత మాత్రాన జ్ఞానం వచ్చేస్తుంది అనుకుంటే పొరపాటే.  బంగారము కూడా అంత సులువుగా దొరకనప్పుడు బంగారము కంటే శ్రేష్టమైన బైబిల్‌లోని  జ్ఞానం మనకు ఎలా దొరికేస్తుంది. 
*బైబిల్ పరిశోధిస్తే జ్ఞానం దొరుకుతుంది.*
👉 మనకు లభిస్తున్న బంగారం ఏవరో త్రవ్వుతారు, ఏవరో శుద్ధి చేస్తారు, ఏవరో విక్రయిస్తారు, అప్పుడు మీరు కొనుగోలు చేసి ధరిస్తారు.
*కాని బైబిల్ వున్న జ్ఞానం అలాంటిది కాదు. మీరే వెతకాలి, మీరే త్రవ్వాలి, మీరే శుద్ధి చేయాలి , మీరే ధరించాలి.*

👉బైబిల్ ని కథల పుస్తకం లాగానో న్యూస్ పేపర్ లాగానో చదివితే ఎమ్ అర్ధం కాదు.
*బైబిల్ ను దేవుని వాక్యం అని గుర్తించి మనస్సు పెట్టి చదివితే దేవుని మాటలు అర్థమవుతాయి...*

*బైబిలు ప్రకారము నాలుగో రోజు సృష్టిలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రముల ప్రస్థావన కనిపించుచున్నది.*
👉 సృష్టి క్రమము తొలిరోజు భూమి ఏర్పడినట్లు (ఆదికాండము 1:-5) లేఖనము చెబుతున్నది.
👉దీనిని బట్టి భూమి ఏర్పడిన తరువాత సూర్యుడు ఆవిర్భావం కనిపిస్తుంది.

*సైన్స్ ప్రకారము సూర్యుడు ఏర్పడిన తరువాత భూమి ఏర్పడింది. అనగా, బైబిలులోని సృష్టి క్రమము సైన్స్ వివరణకు పూర్తి విరుద్ధమనే అభిప్రాయం కలుగుతున్నది. ఇది ఎంతవరకు వాస్తవమో చూద్ధాం.*

"దేవుడు-పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, ఆవి సూచనలను, కాలములను,దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు, భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు గాకనియు పలికెను; ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకును పగటిని, రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటినుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను."

👉పై వాక్యము సృష్టి క్రమము నాలుగో రోజును వివరించుచున్నది.

👉అదే రోజు సూర్యుడు, చంద్రుడు ఏర్పడియున్నారా?లేక అంతకు ముందుగానే ఏర్పడియున్నారా అనే విషయమును ముందుగా నిర్ధారించుకున్నాము. ఆ తరువాత నాలుగో రోజు ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాము.
పై వాక్యములోని *"ఆ రెండు గొప్ప జ్యోతులు", "పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి",*

👉జ్యోతులు అనే వాక్యములు ద్వారా నాలుగో రోజు సృష్టి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రముల గురించిన ప్రస్థావన కనిపించుచున్నది.
*"ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును"* అనే వాక్యములోని *'కలుగును'* అనే పదమును నిశితముగా పరిశీలించినట్లయితే సూర్యుడు, చంద్రుడి సృష్టి గురించి గ్రహించవచ్చును. ఆ వాక్యములోని'కలుగును' అనే పదము 'కనిపించును' అనే అర్థము కోసం వాడబడినది. ఇంగ్లీషు బైబిలునందు ఈ వాక్యమును పరిశీలించినట్లయితే
*"Let great lights APPEAR in the sky"* అని ఉంటుంది.
🔹ఇందులో *appear* అను పదము *'కనిపించును',*
*గోచరమగును',* *'ప్రత్యక్షమగును'* అను సమానార్థములను సూచించును.
👉అనగా గతంలో సృజింపబడిన సూర్య చంద్రులు, నక్షత్రాలను నాలుగో రోజున ప్రత్యక్షం కావాలని దేవుడు ఆజ్ఞాపించినట్లు అర్థమును ఇచ్చును.

*నాలుగో రోజు వరకు సూర్య, చంద్ర నక్షత్రములు ఎందుకు కనిపించలేదు అని లేఖనముల ద్వారా గ్రహింపలేకున్నప్పటికీ*
👉 అప్పటి వరకు అవి ఏమయ్యాయి? అనే ప్రశ్నకు మాత్రం సమాధానం ఉన్నది.

*అది, సూర్యుడిని మబ్బుచేత కప్పబడును,చంద్రుడు వెన్నెల కాయకపోవును* (యెహేజ్కేలు32:7), *నక్షత్రములను మరుగుచేయును* (యోబు9:7) అనునది.

*మరుగైన వాటిని నాలుగో రోజు ప్రత్యక్షతపరచడమెందుకు?*
అనే ప్రశ్నకు సమాధానము లభించును.
*నాలుగో రోజు సృష్టిలోని ప్రధాన అంశాలను ఒక్కసారి ప్రత్యేకించి చూస్తే...*
1.పగటిని రాత్రిని వేరుపరచునట్లు,
2. సూచనలను, కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు,
3. భూమి మీద వెలుగిచ్చుటకు,
4. పగటిని రాత్రిని ఏలుటకు అనే నాలుగు అంశాలు ప్రధానముగా కనిపించును. అవన్నీ ఒకే విషయమును స్పష్టము చేయుచున్నవి. *అదేమనగా ఖగోళ వస్తువులకు దేవుడు విధించుచున్న కట్టడ.*
అది ఎలాగంటే?...
1. వెలుగు చీకటి వేరుపరచు: ఇది సూర్యడు,చంద్రుడు, నక్షత్రములకు అందించు కట్టడ.
2. సూచనలను, కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు: ఇది సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములకు అందించు కట్టడ.
3. భూమి మీద వెలుగిచ్చు: ఇది సూర్యుడు,చంద్రుడికి అందించు కట్టడ.
4. పగటిని రాత్రిని ఏలు: ఇది సూర్యుడు,చంద్రుడికి, నక్షత్రములకు అందించు కట్టడ.
పై వివరణ ద్వారా సృష్టి క్రమము తొలి రోజు నాటి ఖగోళ వస్తువులను నాలుగో రోజు నాటికి ప్రత్యక్షపరచి వాటికి కట్టడలను విధించినట్లు గ్రహించగలము.

అందుకే యోబు గ్రంథకర్త *"వాటి వాటి కాలములో నక్షత్ర రాసులు వచ్చునట్లు చేయగలవా?"* (యోబు 38:32), *"ఆకాశమండలపు కట్టడలను నీవెరుగుదువా? దానికి భూమిమీదగల ప్రభుత్వమును నీవు స్థాపింప గలవా?"* (యోబు38:33) అని పశ్నించియున్నాడు.
👉ఆ పనిని దేవుడు చేసినట్లు చెప్పడం గ్రంథకర్త ఉద్దేశ్యము.

♻ *ఇక సైన్స్ ప్రకారము చూద్దాం...*

*సైన్స్ ప్రకారము:*
నాలుగో రోజుకు ముందుగానే సూర్యుడు ఉన్నాడని సైన్స్ పరంగా నిరూపించడానికి బైబిలులో లేఖన సాక్ష్యాలు బలంగానే చెప్పబడ్డాయి. సృష్టి క్రమములో మూడవ రోజు గడ్డి, మొక్కలు,వృక్షములు మొలవడం (ఆదికాండము 1:11)గురించి. సూర్యుడికి మరియు మొక్కలకు సంబంధం ఏమిటనే విషయము చాలా మందికి తెలిసే ఉంటుంది. మొక్కలు బ్రతకాలంటే కేవలం నీరు మాత్రమే కాదు, వాతావరణంలోని కార్బన్ డై యాక్సైడ్ (మనము ఆక్సిజన్ పీల్చినట్లు) అలాగే సూర్యరశ్మి కూడా కావాలి. సూర్య కిరణాలను గ్రహించి తమకు కావలసిన ఆహారము (గ్లూకోస్)ను తయారు చేసుకుంటాయి.
*దీనినే వృక్షశాస్త్ర పరిభాషలో కిరణజన్య సంయోగ క్రియ అని అంటారు.*
సూర్యరశ్మి లేకపోతే మొక్కలు బ్రతకలేవు.
👉కాబట్టి అప్పటికే భూమి మీద వెలుగు,చీకటి మరియు పగలు, వెలుగు ఉన్నాయనే విషయాన్ని చెప్పడంతో పాటు మొక్కలు ద్వారా ఆ విషయాన్ని స్పష్టము చేయబడుతుంది.

*పై విషయాలన్నీ గమనిస్తే దేవుడు నాలుగవరోజున సూర్యుని, చంద్రున్ని, నక్షత్రాలను చేయలేదు గానీ ఆల్రెడీ అంతకుముందే ఉన్న వాటిని అవి ఎక్కడైతే మరుగున ఉన్నాయో వాటి లో నుండి బయటకు రప్పించాడు అని స్పష్టంగా అర్థమవుతోంది...*

👉అందుకే బైబిల్ ని లోతుగా అధ్యయనం చెయ్యాలి,
👉 పరిశోధించాలి,
👉దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని ప్రార్ధన పూర్వకంగా అడగాలి.

*లేదంటే బైబిల్ ఒక్క ముక్క కూడా అర్థం కాదు,ఇంకా పైనుండి లేనిపోని అపార్ధాలు కలుగుతాయి.*
👉అందుకే బైబిల్ ని లోతుగా అధ్యయనం చెయ్యాలి.

*హల్లెలూయ...*

*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*

Monday, 6 August 2018

Bible world records.

*బైబిల్ వరల్డ్ రికార్డ్స్*

ప్రపంచంలో అరుదైన రికార్డులను గ్రంథస్తం చేసే ‘ది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో  బైబిల్ రికార్డుల మోత, ప్రపంచంలో అత్యంత విరివిగా పంపిణీ చేయబడుతున్న, చడవబడుచున్న,అన్ని కాలాల్లో అత్యుత్తమంగా అమ్ముడవుతున్న గ్రంధంగా  రికార్డ్స్ బద్దలుకొట్టిన బైబిల్...

గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ వారి లెక్కల ప్రకారం 1815-1975 మధ్యకాలంలో 250 కోట్ల బైబిల్ గ్రంథాలు ప్రింట్ చేయబడి అమ్ముడయ్యాయి. ప్రపంచ చరిత్రలో ఇంతగా అమ్ముడైనా పుస్తకం మరొకటి లేదు. ఈ విషయాన్ని ‘గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్’ వారు ధృవీకరించారు.

అయినప్పటికీ ప్రపంచంలోని వారందరికీ బైబిల్ అందాలంటే ఇంటర్నేషనల్ బైబిల్ సొసైటీ ఆఫ్ అమెరికా వారి అంచనా ప్రకారం ఇప్పుడు జరుగుతున్న బైబిల్ అనువాదాలు, ముద్రణా, పంపిణీ ప్రకారం చూస్తే పూర్తి ఉత్తర అమెరికా ఖండానికి 13సం.లు పూర్తి దక్షిణ అమెరికా ఖండానికి 16 సం.లు, పూర్తి ఆస్ట్రేలియా ఖండానికి 30 సం.లు, పూర్తి ఆఫ్రికా ఖండానికి 75సం.లు, పూర్తి యూరప్‌ ఖండానికి 90 సం.లు పడుతుందని అంచనా...
(అసియాఖండం లో మత,సామాజిక,  రాజకీయ అస్థిరవ్యవస్థల కారణంగా ఎలాంటి అంచనాలు లేవు...)

5బిలియన్ కాపీలు (500,00,00,000 ఐదువందల కోట్ల కాపీలకు పైగా) అమ్ముడైన పుస్తకంగా రికార్డ్...

బైబిల్ ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతు మరియు అత్యంత విస్తృతంగా పంపిణీ చేయబదుతున్న ఒకే ఒక్క పుస్తకం, ది ఇంటర్నేషనల్ బైబిలు సొసైటీ వారు చేసిన సర్వే ప్రకారం 1815 మరియు 1975 ల మధ్య సుమారు 2.5 బిలియన్ కాపీలు ముద్రించబడిందని తేలింది, ఇటీవలి చేసిన సర్వేలో ఈ సంఖ్య 5 బిలియన్ల కాపీలను దాటిపోయింది.

1995 చివరి నాటికి, నేటి ఆంగ్ల సంస్కరణ (గుడ్ న్యూస్) న్యూ టెస్ట్మెంట్ మరియు బైబిల్ (బైబిల్ సొసైటీలచే నిర్వహించబడిన కాపీరైట్) యొక్క ప్రపంచవ్యాప్త విక్రయాలు 17.75 మిలియన్ కాపీలు దాటాయి...

హీబ్రూ, అరామిక్ మరియు గ్రీకు భాషల బైబిల్ నుంచి అనేక భాషల్లోకి బైబిల్ అనువదించబడింది. అక్టోబరు 2017 నాటికి, పూర్తి బైబిలు 670 ప్రపంచ గుర్తింపు భాషల్లోకి, క్రొత్త నిబంధన 1,521 భాషల్లోకి మరియు 1,121 ఇతర భాషల్లోకి బైబిల్ చిన్న చిన్న భాగాలు లేదా సండే స్కూల్ పిల్లల కోసం కథలుగా అనువదించబడ్డాయి. కనీసం బైబిల్ యొక్క ఒక పుస్తకం (యోహాను సువార్త లాంటివి) 2,883 భాషల్లోకి అనువదించబడ్డాయి.

★డెన్మార్క్‌కు చెందిన మిషనరీ జీజెన్‌బెల్గ్ తమిళ వ్యాకరణాన్ని రచించడంతోపాటు బైబిల్‌ను తమిళంలోకి అనువదించాడు.

★ప్రపంచంలోనే అత్యధిక చర్చిలున్న ప్రాంతం జమైకా దేశంలోని కింగ్స్టన్,1600 చర్చిలతో గిన్నిస్‌ రికార్డుకెక్కింది.

★ప్రపంచంలో క్రైస్తవ్యాన్ని మొదటిసారిగా అధికారిక మతంగా  స్వీకరించిన దేశం ఆర్మేనియా ఇది మన ఆసియా ఖండంలోని దేశమే, క్రీ.శ 3వ శతాబ్దంలో  (క్రీ.శ.301)  ఆర్మేనియా క్రైస్తవ్యన్ని అధికారిక మతంగా స్వీకరించింది...

★ఒకే దేవుని గూర్చి ఒకరికొకరు పరిచయము లేని సుమారు 40 మంది శిష్యులు, ప్రవక్తలు ప్రవచించిన ఏకైక దైవగ్రంథము.

★ప్రపంచంలో అచ్చు యంత్రము ద్వారా ముద్రించబడిన మొట్టమొదటి గ్రంథము (14వ శతాబ్ధం). భారతదేశంలో కూడా మొట్టమొదటగా ముద్రించబడిన గ్రంధం బైబిల్...

★అత్యధిక ప్రాపంచిక భాషలలోకి అనువదించబడిన ఏకైక దైవ గ్రంథము.
(సుమారు 3,000 కు పైగా భాషలు)

★ప్రపంచవ్యాప్తంగా అత్యధికముగా అమ్ముడవుతు, చదవబడుతున్న ఏకైక దైవ గ్రంథము.

★నిజ దేవుని గూర్చి సరైన, సులువైన నిర్వచనము, ఆధారము, అవగాహనను యిచ్చే ఏకైక దైవ గ్రంథము.
(దేవుడు ప్రేమయై యున్నాడు)

★లోకమును ప్రేమించిన, ప్రేమించుచున్న దేవుని గూర్చి వ్రాయబడిన ఏకైక దైవ గ్రంథము. లోకాన్ని ప్రేమించే దేవుడు బైబిల్లో తప్ప మరియే ఇతర దైవ గ్రంథాలలో కనబడడు.

★ప్రపంచంలోని 70% శాతం మంది శాస్త్రవేత్తల చేత అంగీకరింపబడుచున్న ఏకైక దైవ గ్రంథము.

★విశ్వాన్ని గూర్చిన సమాచారాన్ని శాస్త్రవేత్తల కంటే ముందే లోకానికి తెలిపిన ఏకైక దైవ గ్రంథము.

★విద్యుత్ బల్బు తయారు చేసి, ఆ బల్బ్ వెలుగులో చూడబడిన, చదవబడిన మొట్టమొదటి గ్రంథము. బల్బ్ తయారుచేసిన థామస్ ఆల్వ ఎడిసన్ పలికిన మాట, "బైబిల్ నన్ను వెలిగించింది, నేను ప్రపంచాన్ని వెలిగించాను."

★బైబిల్ గ్రంథానికున్నంత మంది బోధకులు మరే ఇతర గ్రంథానికి లేరు.

★బైబిల్ గ్రంథములో ఉన్న సుమారు వెయ్యి పేజీలలో "పరిశుద్ధత" అనే పదము పేజీకి ఒకటి కంటే ఎక్కువ సార్లు వ్రాయబడియున్నది (వెయ్యిని ఎనభై సార్లు). మరే ఇతర దైవ గ్రంథము చదివినా కనీసం వంద పేజీలకు ఒక్కసారి కూడా ఈ పదము కనబడదు. ప్రపంచవ్యాప్తముగా ఎంతగా వాడబడుచున్నదో అంతగా ద్వేషించబడుతున్న గ్రంథము కూడా  బైబిలే... ఎంతగా ద్వేషించబడుతున్నా కాల్చబడుతున్నా చించబడుతున్నా కూడా ద్వేషించుచున్న వారిలో అనేకులను తన వైపునకు తిప్పుకుని తనకు బోధకులుగా చేసికొంటున్న ఏకైన దైవ గ్రంథము బైబిల్.

★భారతదేశంలో కూడా మొట్టమొదటగా ముద్రించబడిన గ్రంధం బైబిల్.

★1821లో, బెంజమిన్ బైలీ అనే మిషనరీ  కేరళలోని మొట్ట మొదటి ముద్రణా యంత్రం C.M.S. ప్రెస్ ను కొట్టాయంలో స్థాపించాడు. అప్పటి నుండి వార్తా పత్రికలూ మరియు గ్రంథ ప్రచురణలలో రాష్ట్రంలో ఈ నగరం ముందంజలో ఉంది.

Specialist doctor

✍ 🔬 💉✍ 🌡 💊 ✍⛑🔬✍

SPECIALIST DOCTOR

(Exodus-15: 26) - *I am the Lord who heals you* - JEHOVAH RAPHA!!

(Genesis-2:22) - *Surgeon*
(Genesis-2:21) - *Anesthetist*
(Genesis-2:21) - *Plastic Surgeon*
(Matthew-20:34) - *Ophthalmologist*
(Matthew-15:30) - *Orthopaedic*
(Mark-7:32-35) - *ENT Specialist*
(Zechariah-9:7) - *Dentist*
(Matthew-9:6) - *Neurologist*
(Ezekiel-36:26) - *Cardiologist*
(Matthew-8:3) - *Dermatologist*
(Luke-14:2-4) - *Nephrologist*
(1Corinthians-12:9) - *Urologisit*
(Mark-10:14) - *Pediatrician*
(Psalms-113:9) - *Gynecologist*
(Luke-8:33) - *Psychiatrist*
(2Kings-20: 1-7) - *Oncologist*
(Psalms-103:34) - *Physician*
(Acts-9:20) - *Life Changing Specialist*
(John-10:10) - *Life Saving Specialist*

*Please Note :*
No appointments Needed...
Just Call upon His Name JESUS and He's there to HEAL you from head to toe anytime , anywhere ( Psalms-145:18 ).

Praise and rejoice in the Lord always...🙌🏻🙌🏻

Marriage

✳ *క్రైస్తవుల వివాహలలో కులబేధాలు..?*...✍

*"వివాహము అన్ని విషయాలలో ఘనమైనది"*
(హెబ్రీ 13:4).

👉 *నాకు తెలిసి వివాహము నకు మించి పరిశుద్ధమైన, గొప్ప కార్యము ఇంకేమి లేదు అని నా భావన,*
👉ఈ విషయం బైబిల్ స్వయముగా చెప్తోంది.
ఈ వివాహము మనం కూడా బంధువులు, అందరిని పిలిచి ఘనంగా చేస్తాము.

*వివాహం అతి పరిశుద్ధమైనది.*

♻ దేవుడైన యెహోవా వివాహం చేయిస్తే (మత్తయి19:6),

♻ యేసు క్రీస్తు స్వయముగా వివాహానికి ఆహ్వానించబడ్డాడు (యోహాను 2:1).

👉క్రీస్తు తన మొదట సూచక క్రియ వివాహము దగ్గరే చేసారు.

*ఏక శరీరులుగా చేసాడు*
(అది 2:24).

👉 యేసు ఈ లోకమునకు వచ్చే సమయానికి లోకంలో..

✳ *కులబేధాలు తీవ్రస్ధాయిలో ఉన్నాయి.*

✳ *జాతి వైషమ్యాలు ఉన్నాయి.*

🔺 రోమీయులే ప్రధమ పౌరులుగా ఉండేవారు. (అపో 22:26-29, అపో16:38)
🔺తరువాత యూదులు,
🔺ఆ తరువాత అన్యులు,
🔺సమరయులు,
🔺సుంకరులు,
🔺పాపులు ఉండేవారు.

👉 భాషా భేధంలు ఉన్నాయి.
(అపో 6:1)

👉 దేశవిబేధాలు ఉన్నాయి.
(రోమా10:12, కొల3:11)

👉 సున్నతిగలవారమని, సున్నతిలేని వారనే విబేధాలు ఉన్నాయి.
(కొల 3:11, అపో11:1-3)

👉 దాసుడని, స్వతంత్రుడనే బేధాభిప్రాయాలు ఉన్నాయి.
(1కొరిం 12:13)

👉 పురుషుడని, స్త్రీ యనే బేధాలు ఉన్నాయి. (గలతి3:28)

👉 యూదులు అన్యులతో సాంగత్యం చేయరు. వారిని ముట్టుకోరు. (అపో10:28)

👉యూదులు, సమరయులతో సహవాసం చేయరు. వారి చేతినీళ్ళు త్రాగరు.
(యోహాను 4:9)

👉 యూదులు - సుంకరులతో పాపులతో స్నేహం చేయరు. వారితో కలిసి భోజనం చేయరు. (మత్త9:9-11)

👉 బయటనుండి వచ్చినప్పుడు నీళ్ల్లుచల్లుకొనుట, స్నానం చేస్తేనే భోజనం, చేతులు కడుగుకొంటేనే భోజనం వంటి విషయాల్లో నిష్ఠగా పాటించి, పారంపర్య ఆచారాలకు యూదులు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. (మార్కు 7:1-4, లూకా 11:37-39)

👉 *అటువంటి రోజుల్లో యేసు జన్మించి, కుష్టురోగులు, పాపులు, సుంకరులను ముట్టుకొని, వారితో సహవాసం చేసి, వారి ఇంటిలో భోజనం చేసి, పాపాత్మురాలైన స్త్రీ, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీలను కనికరించి, క్షమించి, *పాపుల స్నేహితుడుగా ఎంచబడెను*. (మత్త9:9-11,  26:6-7,  మార్కు14:3,  లూకా7:36-39,  5:27-30, 7:34,  మార్కు2:14-16)

👉 యేసు అందరి కొరకు తన ప్రాణం పెట్టెను.
అందరికొరకు మరణించెను. ప్రతీ మనుష్యుని కొరకు ఆయన మరణం అనుభవించెను. (1తిమో2:6, 2కొరిం5:14-15, అపో10:36, రోమా8:2, 10:12, 11:32)

👉 యేసు తన స్వరక్తమిచ్చి..
🔹ప్రతీ వంశంలోనుండి,
🔹ప్రతీ జనంలో నుండి,
🔹ప్రతీ ప్రజలో నుండి,
🔹ప్రతీ భాషలోనుండి,
🔹ప్రతీ దేశంలోనుండి
దేవునికొరకు మనుష్యులను కొని, వారినిదేవునికి ఒక రాజ్య ముగానూ, యాజకులుగానూ చేసెను. (ప్రక5:9-10, అపో2:5)

*క్రైస్తవుడు నూతన సృష్టి*
(2కొరిం5:17)

*తన ప్రాచీన స్వభావంను వదులుకొని, నవీన స్వభావంధరించుకొనేవాడు క్రైస్తవుడు.* (ఎఫె4:22-24)

👉 నేడు - దేవుని రాజ్య పౌరులు, క్రైస్తవులు, సంఘ సభ్యులు మధ్య కులభేధాలు ఉండకూడదు.

👉 వారంతా ఒకేచోట కలిసి నివశించడానికి,
ఒకేచోట కలిసి పడుకోవడానికి,
ఒకే ప్రదేశంలో కలిసి కూడుకోవడానికి,
ఒకే చోట కలిసి భోజనం చేయడానికి,
వారి పిల్లలకు కులాలకు అతీతంగా వివాహాలు జరిగి, వారు కలిసి పడుకోవడానికి ..

👉 సింహంలాంటి వ్యక్తి గడ్డిమేయడానికి,
కొదమసింహం లాంటి వ్యక్తి సాధువుగా మారడానికి,
నాగుపాములాంటి వ్యక్తి హానిచేయకుండా కలిసి ఆడుకోవడానికి,
మృగము లాంటి వ్యక్తి మంచిగా జీవించడానికి..

👉దేవుని రాజ్యపౌరులు ఇష్టపడాలి.
అందుకు సిద్దపడియుండాలి. (యెష11:6-9)

*అటువంటివారియొక్క సముదాయం క్రీస్తుసంఘం.*

✳ *కులాంతర వివాహాలు* ✳ (intercaste marriages)

*1. లోకాను సారమైన కులాంతర వివాహాలు.*

👉 *"కులాంతర ప్రేమ వివాహం"*
ఇది మనకు తెల్సిందే. కొన్ని వివాహాలు సకెస్స్ అయ్యాయి. కొన్ని మధ్యలో పాడై పోయాయి.

👉 *"కులాంతర పెద్దలు నిర్ణయించిన వివాహాలు."*
ఈ సమాజం తక్కవ కులం అని ముద్ర వేసిన కులం నుంచి బాగా చదువుకుని మంచి ఉద్యోగాలలో స్థిరపడిన వారిని అగ్ర కులాల వారు అల్లుళ్ళ గాను కోడళ్ళ గాను చేసుకున్నారు.
ఇవి కూడా కొన్ని సక్సెస్స్ అయ్యాయి కొన్ని పాడై పోయ్యాయి.
ex : వేకనూరు గ్రామంలో అత్తాడి పద్మనాభరావు(s.c) కలక్టర్ జాబ్ వచ్చింది అతని ఉద్యోగాని బట్టి కాపు కులస్తులు అల్లుడిగా  చేసుకున్నారు కాని భార్య భర్తలకు పొసగలేదు.

*2. దైవానుసారమైన కులాంతర వివాహాలు.* 
👉 (ఈ టైటిల్ పెట్టకూడదు)

*క్రీస్తు రక్తం లో కడుగబడిన తరువాత కులం అనే ప్రసక్తి మన నోటి నుండి రాకూడదు. కాని మనలో ఉన్న మూల పాపాల ఆధారంగా కులానికి కొంత ప్రాధాన్యత ఇస్తున్నాము.*

♻ *వివాహ విషయంలో దేవుడు ఏమి చెప్తున్నాడు.?*

🔺 *నీవు కనాను కుమార్తెలలో ఎవరినీ వివాహము చేసికొనకూడదు*
(ఆది 28:1).

🔺 *వారితో వియ్యమందకూడదు*
(ద్వితీ 7:3,4).

✴ *అన్య స్త్రీలను చేసుకోకూడదు.*
( నెహెమ్యా 13:27)

✴ *స్వజాతియులనే వివాహము చేసుకోవాలి.*
(న్యాయాది14:3)

✴ *అనేక వివాహాలు చేసుకోకూడదు.*
( ద్వితి17 :17)

♻ దేవుడు అన్యజనులను, అనగా తన ప్రజలు కానివారిని వివాహము చేసికొనుటకు అనుమతించలేదు.

👉 *బైబిల్ లో కులాంతర వివాహాలు.*
ఏశావు  ✖
యోసేపు ✔
మోషే    ✔
శల్మాను- రాహాబు✔
బోయజు- రూతు✔
సంసోను-ఫిలిష్తీయురాలు✖
దావీదు-బత్షెేబా (హిత్తీయురాలు)✔
సొలోమోను-ఫరో కుమార్తె (ఐగుప్తీయురాలు)✖
ఎస్తేరు-అహష్వారోషు✔

ఇంక మనం అనేకమైనవి చూడొచ్చేమో...... 

🔹 *క్రొత్త నిబంధనలో క్రీస్తు రక్తము చేత కడుగబడినవారే దేవుని ప్రజలు అని పిలువబడ్డారు. వీరే క్రైస్తవులు. కాబట్టి క్రైస్తవులు, క్రైస్తవులు కానివారిని వివాహము చేసికొనకూడదు.*

బైబిల్ గ్రంథములోని కొన్ని వివాహాలు చూచుదము:

❌ *Contract Marriage* (ఆదికాండము 29:25):

1⃣ *యాకోబు – రాహేలు వివాహం.*

ఫలితం: రాహేలు చాలాకాలం గొడ్రాలు గానే ఉంది. తద్వారా తరుచూ భర్త కోపానికి గురవుతూ ఉండేది.

❌ *Offer Marriage*
(౹ సమూయేలు 17:19,25; 18:17,18):

2⃣ *దావీదు – మీకాలు వివాహం.*

ఫలితం: మీకాలుకు సంతానం కలగలేదు.

❌ *Attraction Marriage*
(న్యాయధిపతులు 14:1)

3⃣ *సమ్సోను – ఫిలిష్తీయ కుమార్తె వివాహం.*

ఫలితం: సమ్సోను పతనం.

❌ *Positional Marriage*

4⃣ *అహాబు – యెజెబెలు వివాహం.*

ఫలితం: అహాబు భ్రష్టుడై మరణించాడు.

5⃣ *Blessed Marriage*
(ఆదికాండము 24):

✔ *మొట్టమొదటి వివాహం ఆదాము - హవ్వలది*

1 *వివాహము అనగా నేమి?*

👉 *వీడి, విడిగా ఉన్నవారిద్దరు ఏకమగుట.*

*“కాబట్టి పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు”.* (అది 2:24)

👉విశ్వాసంలో ఏకత్వం గల క్త్రైస్తవ స్త్రీ, పురుషుల వివాహం బహుసుందరమైనది.
👉 వారిద్దరూ ఒక్క యజమాయని సేవకులే! శారీరకంగా గాని ఆత్మీయంగాగాని ఏదీ వారిని విడదీయలేదు.
👉 *వారు ఇద్దరూ ఏక శరీరులు.*
🔺 ఒకే శరీరంగా ఉన్న చోట ఒకే ఆత్మ ఉంటుంది.
🔺వారు కలిసి ప్రార్ధిస్తారు.
🔺 కలిసి ఆరాధిస్తారు.
🔺ఒకరి కొకరు ఉపదేశించుకొంటూ
🔺ఒకరి నొకరు బలపరచు కొంటారు.
🔺ఇద్దరూ కలిసి సంఘారాధనలకు వెళ్తారు.
🔺 కలిసి కష్టాల నెదుర్కొంటారు. శ్రమలను తట్టుకొంటారు.
🔺 ఒకరినొకరు ఓదార్చుకొంటారు.
🔺వారిలో వారికి దాచుకోవలసిన రహస్యాలు ఉండవు.
🔺 ఒకరి హృదయాన్ని ఒకరు విషాదభరితంగా చేసుకోరు.

*ఇవన్నీ చూడడం, వినడం ద్వారా క్రీస్తు ఆనంద భరితుడౌతాడు.*

👉ఇలాంటివారికి ఆయన తన యొక్క శాంతిని, సమాధానాన్ని యిస్తాడు.
👉 ఎక్కడ ఇద్దరు కలిసి ఉంటారో అక్కడ ఆయన ప్రత్యక్షమౌతాడు.
👉ఆయన ఉన్న చోట అపవాదికి తావులేదు. గనుక *ఆయన ఉన్న ఇల్లు పరలోకమే.*
👉 *కుటుంబం దేవుడు ఏర్పాటు చేసినది.*

👉 *దేవుడు ఆదాము, హవ్వలను భార్యా భర్తలుగా ఏర్పాటుచేసి ఫలించి అభివృద్ధి చెందుమని చెప్పెను.*
అయితే కుటుంబములో సాతాను జొరబడి సంతోష సమాధానాలు లేకుండా చేయడానికి ప్రయాసపడుచున్నాడు. *కనుకనే ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత తన కుటుంబమును కట్టుకొనుట ఎంతో ముఖ్యము!*

👉 మనం ఏదైనా నేర్చుకోవాలంటే మరొక వివాహానికి వెళ్ళాలి.
అదే
✔  *ఇస్సాకు – రీబ్కాల వివాహం.*

*వివాహ ప్రణాళిక, వివాహ ప్రక్రియ, ప్రతి అంకములో దేవుని తోడు, ఆశీర్వాదము కనబడుతుంది.*

ఫలితం: రీబ్కా 2 గొప్ప జనాంగములకు తల్లి అయినది (ఆదికాండము 25:19-23).

■ ఇది దేవుని చిత్త ప్రకారమైన వివాహం,

■ తండ్రికి ఆలోచన కలిగి, నిర్ణయించి, ప్రార్ధించి, కనిపెట్టుట వలన జరిగిన వివాహం.

■ వివాహానికి ముందు ప్రార్ధన,

■ వివాహ నిశ్చయానికి ప్రార్థన,

■ English లో చెప్పాలంటే అంతా systematic గా ఒక పద్ధతిలో జరుగడం చూస్తాం.

■ అన్ని విషయాల్లో దేవుని అడగడం, దేవుడు అనుమతించడం కనబడుతుంది.

👉 *ఇంత ఘనమైన వివాహము బైబిల్లో ఎక్కడా కనబడదు.*

👉 *ఎందుకంటే ఇది దేవుడే జరిగించిన వివాహం. ఆశీర్వదించబడిన వివాహం.*

❇ *మన మధ్యలో జీవించిన పరిశుద్దలైన కొంత మంది  భక్తులని గురించి  చెప్పుకుందాం.*

♻ *దానియేలు గారు* (l.e.f.వ్యవస్థాపకులు) ఆయన దేవుని చిత్త ప్రకారమైన కులాంతర వివాహం చేసుకున్నారు. ఆయన డినామినేషన్ లో కూడా దేవుని చిత్తానుసారమైన కులాంతర వివాహాలను చేశారు.

♻ *సహో. భక్తసింగ్* గారు ఆయన డినామినేషన్ లో కూడా కులాంతర వివాహాలకే (దేవుని చిత్తనుసారమైన) ప్రాధాన్యం.

అయితే  *భక్తి లోతు లేని మనుష్యలలో కులం పునాదులు ఉన్నట్లయితే వివాహ వ్యవస్థ దెబ్బతింటుంది.*
👉 *దేవుని నామానికి అవమానం కలుగుతుంది.*
👉 కాబట్టి ఈ మధ్యన డినామినేషన్స్ లో కులం అనే భావన తీసుకోలేని వారికి వారి కులం లోనే వివాహాలు చేస్తున్నారు. 

నిలబడ గలిగితే దేవుని నామమునకు అవమానం తీసుకుని  రాక పోయ్యేటట్లయితే *దేవుని చిత్తాను సారమైన  వివాహం     (కులం చూడకుండా)* చేసుకోండి.    
*కులం అనే కుళ్ళు మనస్సు లో ఉన్నంత వరకు మనం నిజ క్రైస్తవులం కాలేము. ఒక వేళ బలవంతంగా వివాహం చేసినా లేక చేసుకున్నా దేవుని నామానికి అవమానం.*

👉 *వివాహాల దగ్గరే మనకు..*
కులబేధాలు ఉన్నాయో లేదో తేలిపోతుంది.
కులవివక్ష ఉన్నదో లేదో తేలిపోతుంది.
కుల గజ్జి ఉందో లేదో అర్ధమౌతుంది.

👉Intercaste marriage చేసుకోవాలంటే  నీకు daring కావాలి.

👉నీ పారంపర్యాచారాలు విడచిపెట్టి, సమాజాన్ని ఎదిరించగలిగే దమ్ము ఉండాలి.

👉బంధువులు, మిత్రులకు ఏమనుకుంటారో అనుకుంటే నీవు క్రైస్తవుడవు కాలేవు.

👉 *క్రైస్తవుల జీవన శైలి వల్ల కుల వివక్ష లేని సమాజం తయారుకావాలి.*

👉 *క్రైస్తవుల వల్ల కులరహిత సమాజం నిర్మించబడాలి.*

👉అటువంటి వాతావరణం  క్రీస్తు తన రక్తం ఇచ్చికొన్న సంఘంలో సాధ్యం.

*క్రైస్తవులలో కులభేధాలు కూకటివేళ్ళతో పెకలింపబడాలి.*

*హల్లెలూయ...*

*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*

Thursday, 2 August 2018

Holy life

🔴 లోకం ఎంగిలి చేసిన జీవితం దేవునికెందుకు....❓

         👉 ఒకరోజు.......డి.ఎల్.మూడి. గారు

ఒక హీరోయిన్ ఇంటికి వెళ్ళారు అపుడు ఆ హీరోయిన్ గొప్ప దైవజనులు తన ఇంటికి వచ్చారని సంతోషించి లోపటికి ఆహ్వానించి .....ఒక కప్పులో కాఫీ తెచ్చి ఇచ్చింది

🔹అపుడు డి. ఎల్.మూడి గారు ఆ అమ్మాయి తో మాట్లాడుతూ ......అమ్మా  చూడ్డానికి చక్కగా వున్నావు మంచి మాటతీరు గలదానివి దేవుడు నీకు మంచి తలాంతులు యిచ్చాడు ఇవన్నీ పక్కన పెట్టి సినిమాలో నటిస్తూ అందులోనే జీవిస్తున్నావు నువ్వు ప్రభు బిడ్డగా జీవిస్తే బాగుంటుందమ్మా అని చెబితే ....దానికి...

ఆ హీరోయిన్ చెప్పిన మాటలు....

👉 అయ్యా నాకు నీతిగా,ప్రభువు కొరకు జీవించాలని ఉంది కాని ఈ మధ్యనే మూడు సినిమాలు హిట్ అయ్యాయి సినిమా ఆఫర్లు పెరిగాయి కాబట్టి ఇపుడే ఎక్కువ సినిమాల్లో నటించి డబ్బు సంపాదించాలి

వయస్సు పెరిగిన తరువాత అందము పోయిన తరువాత సినిమా ఫీల్డులో కొనసాగడం కష్టం అప్పుడు నేను కచ్చితంగా వచ్చి దేవుని బిడ్డగా మారిపోయి దేవునికి సాక్షిగా జీవిస్తాను అని బదులు చెప్పిందట.........
👉 అపుడు డ్.ఎల్.మూడి గారు మధ్యలోనే కాఫీ తాగటం మానేసి అమ్మా

👉 నేను ఈ కాఫీ సగం త్రాగాను మిగిలింది నువ్వు  త్రాగు.......అని చెప్పి ఆ సగం కాఫీ ఆమెకి ఇవ్వబోగా ఆమె బహు కోపంతో౼

ఏదేమిటండీ పాస్టరు గారు.......

🔹 మీరు సగం త్రాగి మిగిలింది నన్ను తాగమంట్టున్నారు .....మీరు ఎంగిలి చేసిన కప్పు నేను ఎలా త్రాగగలను ??

👉 ఇదేనా మీరు నేర్చుకున్న మర్యాద ,గౌరవము❓ ఇదేనా మీరు నేర్పిస్తున్న ఆత్మీయత ❓

👉 అని ఎదురుగా వున్న దైవజనుడు గొప్పవారని గ్రహించకుండా ఆ హీరోయిన్ తన ఆవేశమంతా వెళ్లగక్కేసింది ......

🔹మవునంగా మాటలన్నీ వింటున్న డ్.ఎల్. మూడి గారు సరేనమ్మా  అయితే ......

దేవుని సేవకూడనైన నేను ఎంగిలి చేసిన కప్పును ఇచ్చి మిగిలింది త్రాగమంటేనే ఇన్ని మాటలు అంటున్నావే.....

👉 నిన్ను లోకమంతా ఎంగిలి చేసిన తరువాత ఇప్పుడు నీకున్న అందం ,సత్తువ, సమస్తం ఉడికిపోయిన తరువాత....... ఇక నీ వలన ఎవరికి ఉపయోగం లేదని తేలిన తరువాత.......దేవుని దగ్గరకు వచ్చి ౼ప్రభువా ! ఇదిగో లోకం ఎంగిలి చేసిన నా జీవితాన్ని, బలాన్ని కోల్పోయిన నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను అని నీవు అన్నపుడు దేవుడు  వకవేళ నీవు ఇప్పుడు కోపాపడిన విధంగానే కోపాపడితే ఏమి చేస్తావు ❓

ఒక సేవకూడనైన నేను ఎంగిలి చేసిన కప్పును ఇస్తేనే అంత కోపం వచ్చిందే !!

👉 మరి దేవుడు నీకు అద్భుతమైన దేహాన్ని ఇచ్చాడు

👉  ఈ దేహం దేవుని ఆలయం నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వకుండా ఈ ఆలయంలో నీ ఇష్టానుసారముగా పాపపు పనులు చేసి  లోకమంతా ఎంగిలి చేసిన తరువాత అప్పుడు వచ్చి ఇదిగో ప్రభువా నా జీవితం నీకు ఇస్తున్నాను అన్నపుడు ........

..........ఛీ....!! పాపిష్టి పనులు చేసి నీ జీవితాన్ని లోకమంతా ఎంగిలి చేసిన తరువాత ఇపుడు వచ్చి నీ శరీరాన్ని నాకు ఇస్తానంటున్నావు ........నాకు అవసరం లేదు పో అని ప్రభు అన్నట్లుయితే నువ్వు ఎక్కడికి వెళతావో తెలుసా ❓

👉  తిన్నగా నరకానికి వెళ్తావు ..

🔹 జీవం లేని కప్పును ఎంగిలి చేయమంటేనే
నీకు అంత కోపం వచ్చిందే .......

👉 జీవం ఉన్న నీవు ఎంగిలి అయిన తరువాత దేవునికి సమర్పించు కుంట్టానంటే  ......ఆయనకు ఎంత కోప రావాలో ఒక్కసారి ఆలోచించు అని అనగానే ......

ఆ మాటలు ఆ హీరోయిన్ హృదయంలో బల్లెపు పోటులా దిగాయి ......

🔹 ఆమె ఒక్కసారిగా తన మోకాళ్ళ మీద పడి పచ్ఛాత్తాపంతో దేవుడు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని లోకానికి అమ్ముకోను .......
నా కోసం ప్రాణం పెట్టిన దేవుని కొరకే ఇకనుంచి జీవిస్తాను అని తన పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి దేవునికి తన జీవితాన్ని సమర్పించుకుంది.......

👉 సహోదరి.....సహోదరుడా !!!
నీ యవ్వన శరీరాన్ని ,నీ జీవితాన్ని , నీకు దేవుడు అనుగ్రహించిన తలాంతులును లోకానికి, సైతానుకి, అమ్ముకుని ఆ పాపం లోనే జీవిస్తూ ....నీ జీవితాన్ని నాశనం చేసుకుని .......ఆఖరికి నీ వలన ఎవరికి ఉపయోగం లేదని తెలిసిన తరువాత......నిను కన్న తల్లిదండ్రులే.....నిన్ను .... ఛీఛీ....అన్న తరువాత

🔹నీ వయస్సు అయిపోయిన తరువాత నీలో ఉన్న బలం, సత్తువ, ఉడిగి.. ఎంగిలి అయిన తర్వాత దేవుడు దగ్గరకు వచ్చి ప్రభువా !!!నేను  నీకు ఏమైనా ఉపయోగ పడతానా......❓
అని అపుడు దేవున్ని ప్రాధేయపడటమ్ కంటె ......
నీ యవ్వన ప్రాయములోనే నీలో బలం ఉన్నపుడే  నిన్ను లోకం ఎంగిలి చేయక ముందే ఈ లోక మాలిన్యం నిన్ను అంతకుముందే నీ జీవితాన్ని దేవుని చేతిలో పెడితే ఎంత బాగుంటుంది.......

👉 యేసేపు యవ్వనాన్ని పరిశుద్ధంగా కాపాడుకునే దేవుని చేతిలో తన జీవితాన్ని పెట్టాడు

పవిత్రమైన తన జీవితాన్ని పాపం చేత ఎంగిలి కానివ్వలేదు  ......  

👉 దేశానికే అధిపతిగా చేయబడ్డాడు....

👉 వస్తావా జీవముగల దేవుని దగ్గరకు....
👉 ఇస్తావా ఈ రోజు అయినా దేవునికి.......
👉  నీ జీవితాన్ని, నీ హృదయాన్ని.....