✳ *క్రైస్తవుల వివాహలలో కులబేధాలు..?*...✍
*"వివాహము అన్ని విషయాలలో ఘనమైనది"*
(హెబ్రీ 13:4).
👉 *నాకు తెలిసి వివాహము నకు మించి పరిశుద్ధమైన, గొప్ప కార్యము ఇంకేమి లేదు అని నా భావన,*
👉ఈ విషయం బైబిల్ స్వయముగా చెప్తోంది.
ఈ వివాహము మనం కూడా బంధువులు, అందరిని పిలిచి ఘనంగా చేస్తాము.
*వివాహం అతి పరిశుద్ధమైనది.*
♻ దేవుడైన యెహోవా వివాహం చేయిస్తే (మత్తయి19:6),
♻ యేసు క్రీస్తు స్వయముగా వివాహానికి ఆహ్వానించబడ్డాడు (యోహాను 2:1).
👉క్రీస్తు తన మొదట సూచక క్రియ వివాహము దగ్గరే చేసారు.
*ఏక శరీరులుగా చేసాడు*
(అది 2:24).
👉 యేసు ఈ లోకమునకు వచ్చే సమయానికి లోకంలో..
✳ *కులబేధాలు తీవ్రస్ధాయిలో ఉన్నాయి.*
✳ *జాతి వైషమ్యాలు ఉన్నాయి.*
🔺 రోమీయులే ప్రధమ పౌరులుగా ఉండేవారు. (అపో 22:26-29, అపో16:38)
🔺తరువాత యూదులు,
🔺ఆ తరువాత అన్యులు,
🔺సమరయులు,
🔺సుంకరులు,
🔺పాపులు ఉండేవారు.
👉 భాషా భేధంలు ఉన్నాయి.
(అపో 6:1)
👉 దేశవిబేధాలు ఉన్నాయి.
(రోమా10:12, కొల3:11)
👉 సున్నతిగలవారమని, సున్నతిలేని వారనే విబేధాలు ఉన్నాయి.
(కొల 3:11, అపో11:1-3)
👉 దాసుడని, స్వతంత్రుడనే బేధాభిప్రాయాలు ఉన్నాయి.
(1కొరిం 12:13)
👉 పురుషుడని, స్త్రీ యనే బేధాలు ఉన్నాయి. (గలతి3:28)
👉 యూదులు అన్యులతో సాంగత్యం చేయరు. వారిని ముట్టుకోరు. (అపో10:28)
👉యూదులు, సమరయులతో సహవాసం చేయరు. వారి చేతినీళ్ళు త్రాగరు.
(యోహాను 4:9)
👉 యూదులు - సుంకరులతో పాపులతో స్నేహం చేయరు. వారితో కలిసి భోజనం చేయరు. (మత్త9:9-11)
👉 బయటనుండి వచ్చినప్పుడు నీళ్ల్లుచల్లుకొనుట, స్నానం చేస్తేనే భోజనం, చేతులు కడుగుకొంటేనే భోజనం వంటి విషయాల్లో నిష్ఠగా పాటించి, పారంపర్య ఆచారాలకు యూదులు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. (మార్కు 7:1-4, లూకా 11:37-39)
👉 *అటువంటి రోజుల్లో యేసు జన్మించి, కుష్టురోగులు, పాపులు, సుంకరులను ముట్టుకొని, వారితో సహవాసం చేసి, వారి ఇంటిలో భోజనం చేసి, పాపాత్మురాలైన స్త్రీ, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీలను కనికరించి, క్షమించి, *పాపుల స్నేహితుడుగా ఎంచబడెను*. (మత్త9:9-11, 26:6-7, మార్కు14:3, లూకా7:36-39, 5:27-30, 7:34, మార్కు2:14-16)
👉 యేసు అందరి కొరకు తన ప్రాణం పెట్టెను.
అందరికొరకు మరణించెను. ప్రతీ మనుష్యుని కొరకు ఆయన మరణం అనుభవించెను. (1తిమో2:6, 2కొరిం5:14-15, అపో10:36, రోమా8:2, 10:12, 11:32)
👉 యేసు తన స్వరక్తమిచ్చి..
🔹ప్రతీ వంశంలోనుండి,
🔹ప్రతీ జనంలో నుండి,
🔹ప్రతీ ప్రజలో నుండి,
🔹ప్రతీ భాషలోనుండి,
🔹ప్రతీ దేశంలోనుండి
దేవునికొరకు మనుష్యులను కొని, వారినిదేవునికి ఒక రాజ్య ముగానూ, యాజకులుగానూ చేసెను. (ప్రక5:9-10, అపో2:5)
*క్రైస్తవుడు నూతన సృష్టి*
(2కొరిం5:17)
*తన ప్రాచీన స్వభావంను వదులుకొని, నవీన స్వభావంధరించుకొనేవాడు క్రైస్తవుడు.* (ఎఫె4:22-24)
👉 నేడు - దేవుని రాజ్య పౌరులు, క్రైస్తవులు, సంఘ సభ్యులు మధ్య కులభేధాలు ఉండకూడదు.
👉 వారంతా ఒకేచోట కలిసి నివశించడానికి,
ఒకేచోట కలిసి పడుకోవడానికి,
ఒకే ప్రదేశంలో కలిసి కూడుకోవడానికి,
ఒకే చోట కలిసి భోజనం చేయడానికి,
వారి పిల్లలకు కులాలకు అతీతంగా వివాహాలు జరిగి, వారు కలిసి పడుకోవడానికి ..
👉 సింహంలాంటి వ్యక్తి గడ్డిమేయడానికి,
కొదమసింహం లాంటి వ్యక్తి సాధువుగా మారడానికి,
నాగుపాములాంటి వ్యక్తి హానిచేయకుండా కలిసి ఆడుకోవడానికి,
మృగము లాంటి వ్యక్తి మంచిగా జీవించడానికి..
👉దేవుని రాజ్యపౌరులు ఇష్టపడాలి.
అందుకు సిద్దపడియుండాలి. (యెష11:6-9)
*అటువంటివారియొక్క సముదాయం క్రీస్తుసంఘం.*
✳ *కులాంతర వివాహాలు* ✳ (intercaste marriages)
*1. లోకాను సారమైన కులాంతర వివాహాలు.*
👉 *"కులాంతర ప్రేమ వివాహం"*
ఇది మనకు తెల్సిందే. కొన్ని వివాహాలు సకెస్స్ అయ్యాయి. కొన్ని మధ్యలో పాడై పోయాయి.
👉 *"కులాంతర పెద్దలు నిర్ణయించిన వివాహాలు."*
ఈ సమాజం తక్కవ కులం అని ముద్ర వేసిన కులం నుంచి బాగా చదువుకుని మంచి ఉద్యోగాలలో స్థిరపడిన వారిని అగ్ర కులాల వారు అల్లుళ్ళ గాను కోడళ్ళ గాను చేసుకున్నారు.
ఇవి కూడా కొన్ని సక్సెస్స్ అయ్యాయి కొన్ని పాడై పోయ్యాయి.
ex : వేకనూరు గ్రామంలో అత్తాడి పద్మనాభరావు(s.c) కలక్టర్ జాబ్ వచ్చింది అతని ఉద్యోగాని బట్టి కాపు కులస్తులు అల్లుడిగా చేసుకున్నారు కాని భార్య భర్తలకు పొసగలేదు.
*2. దైవానుసారమైన కులాంతర వివాహాలు.*
👉 (ఈ టైటిల్ పెట్టకూడదు)
*క్రీస్తు రక్తం లో కడుగబడిన తరువాత కులం అనే ప్రసక్తి మన నోటి నుండి రాకూడదు. కాని మనలో ఉన్న మూల పాపాల ఆధారంగా కులానికి కొంత ప్రాధాన్యత ఇస్తున్నాము.*
♻ *వివాహ విషయంలో దేవుడు ఏమి చెప్తున్నాడు.?*
🔺 *నీవు కనాను కుమార్తెలలో ఎవరినీ వివాహము చేసికొనకూడదు*
(ఆది 28:1).
🔺 *వారితో వియ్యమందకూడదు*
(ద్వితీ 7:3,4).
✴ *అన్య స్త్రీలను చేసుకోకూడదు.*
( నెహెమ్యా 13:27)
✴ *స్వజాతియులనే వివాహము చేసుకోవాలి.*
(న్యాయాది14:3)
✴ *అనేక వివాహాలు చేసుకోకూడదు.*
( ద్వితి17 :17)
♻ దేవుడు అన్యజనులను, అనగా తన ప్రజలు కానివారిని వివాహము చేసికొనుటకు అనుమతించలేదు.
👉 *బైబిల్ లో కులాంతర వివాహాలు.*
ఏశావు ✖
యోసేపు ✔
మోషే ✔
శల్మాను- రాహాబు✔
బోయజు- రూతు✔
సంసోను-ఫిలిష్తీయురాలు✖
దావీదు-బత్షెేబా (హిత్తీయురాలు)✔
సొలోమోను-ఫరో కుమార్తె (ఐగుప్తీయురాలు)✖
ఎస్తేరు-అహష్వారోషు✔
ఇంక మనం అనేకమైనవి చూడొచ్చేమో......
🔹 *క్రొత్త నిబంధనలో క్రీస్తు రక్తము చేత కడుగబడినవారే దేవుని ప్రజలు అని పిలువబడ్డారు. వీరే క్రైస్తవులు. కాబట్టి క్రైస్తవులు, క్రైస్తవులు కానివారిని వివాహము చేసికొనకూడదు.*
బైబిల్ గ్రంథములోని కొన్ని వివాహాలు చూచుదము:
❌ *Contract Marriage* (ఆదికాండము 29:25):
1⃣ *యాకోబు – రాహేలు వివాహం.*
ఫలితం: రాహేలు చాలాకాలం గొడ్రాలు గానే ఉంది. తద్వారా తరుచూ భర్త కోపానికి గురవుతూ ఉండేది.
❌ *Offer Marriage*
(౹ సమూయేలు 17:19,25; 18:17,18):
2⃣ *దావీదు – మీకాలు వివాహం.*
ఫలితం: మీకాలుకు సంతానం కలగలేదు.
❌ *Attraction Marriage*
(న్యాయధిపతులు 14:1)
3⃣ *సమ్సోను – ఫిలిష్తీయ కుమార్తె వివాహం.*
ఫలితం: సమ్సోను పతనం.
❌ *Positional Marriage*
4⃣ *అహాబు – యెజెబెలు వివాహం.*
ఫలితం: అహాబు భ్రష్టుడై మరణించాడు.
5⃣ *Blessed Marriage*
(ఆదికాండము 24):
✔ *మొట్టమొదటి వివాహం ఆదాము - హవ్వలది*
1 *వివాహము అనగా నేమి?*
👉 *వీడి, విడిగా ఉన్నవారిద్దరు ఏకమగుట.*
*“కాబట్టి పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు”.* (అది 2:24)
👉విశ్వాసంలో ఏకత్వం గల క్త్రైస్తవ స్త్రీ, పురుషుల వివాహం బహుసుందరమైనది.
👉 వారిద్దరూ ఒక్క యజమాయని సేవకులే! శారీరకంగా గాని ఆత్మీయంగాగాని ఏదీ వారిని విడదీయలేదు.
👉 *వారు ఇద్దరూ ఏక శరీరులు.*
🔺 ఒకే శరీరంగా ఉన్న చోట ఒకే ఆత్మ ఉంటుంది.
🔺వారు కలిసి ప్రార్ధిస్తారు.
🔺 కలిసి ఆరాధిస్తారు.
🔺ఒకరి కొకరు ఉపదేశించుకొంటూ
🔺ఒకరి నొకరు బలపరచు కొంటారు.
🔺ఇద్దరూ కలిసి సంఘారాధనలకు వెళ్తారు.
🔺 కలిసి కష్టాల నెదుర్కొంటారు. శ్రమలను తట్టుకొంటారు.
🔺 ఒకరినొకరు ఓదార్చుకొంటారు.
🔺వారిలో వారికి దాచుకోవలసిన రహస్యాలు ఉండవు.
🔺 ఒకరి హృదయాన్ని ఒకరు విషాదభరితంగా చేసుకోరు.
*ఇవన్నీ చూడడం, వినడం ద్వారా క్రీస్తు ఆనంద భరితుడౌతాడు.*
👉ఇలాంటివారికి ఆయన తన యొక్క శాంతిని, సమాధానాన్ని యిస్తాడు.
👉 ఎక్కడ ఇద్దరు కలిసి ఉంటారో అక్కడ ఆయన ప్రత్యక్షమౌతాడు.
👉ఆయన ఉన్న చోట అపవాదికి తావులేదు. గనుక *ఆయన ఉన్న ఇల్లు పరలోకమే.*
👉 *కుటుంబం దేవుడు ఏర్పాటు చేసినది.*
👉 *దేవుడు ఆదాము, హవ్వలను భార్యా భర్తలుగా ఏర్పాటుచేసి ఫలించి అభివృద్ధి చెందుమని చెప్పెను.*
అయితే కుటుంబములో సాతాను జొరబడి సంతోష సమాధానాలు లేకుండా చేయడానికి ప్రయాసపడుచున్నాడు. *కనుకనే ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత తన కుటుంబమును కట్టుకొనుట ఎంతో ముఖ్యము!*
👉 మనం ఏదైనా నేర్చుకోవాలంటే మరొక వివాహానికి వెళ్ళాలి.
అదే
✔ *ఇస్సాకు – రీబ్కాల వివాహం.*
*వివాహ ప్రణాళిక, వివాహ ప్రక్రియ, ప్రతి అంకములో దేవుని తోడు, ఆశీర్వాదము కనబడుతుంది.*
ఫలితం: రీబ్కా 2 గొప్ప జనాంగములకు తల్లి అయినది (ఆదికాండము 25:19-23).
■ ఇది దేవుని చిత్త ప్రకారమైన వివాహం,
■ తండ్రికి ఆలోచన కలిగి, నిర్ణయించి, ప్రార్ధించి, కనిపెట్టుట వలన జరిగిన వివాహం.
■ వివాహానికి ముందు ప్రార్ధన,
■ వివాహ నిశ్చయానికి ప్రార్థన,
■ English లో చెప్పాలంటే అంతా systematic గా ఒక పద్ధతిలో జరుగడం చూస్తాం.
■ అన్ని విషయాల్లో దేవుని అడగడం, దేవుడు అనుమతించడం కనబడుతుంది.
👉 *ఇంత ఘనమైన వివాహము బైబిల్లో ఎక్కడా కనబడదు.*
👉 *ఎందుకంటే ఇది దేవుడే జరిగించిన వివాహం. ఆశీర్వదించబడిన వివాహం.*
❇ *మన మధ్యలో జీవించిన పరిశుద్దలైన కొంత మంది భక్తులని గురించి చెప్పుకుందాం.*
♻ *దానియేలు గారు* (l.e.f.వ్యవస్థాపకులు) ఆయన దేవుని చిత్త ప్రకారమైన కులాంతర వివాహం చేసుకున్నారు. ఆయన డినామినేషన్ లో కూడా దేవుని చిత్తానుసారమైన కులాంతర వివాహాలను చేశారు.
♻ *సహో. భక్తసింగ్* గారు ఆయన డినామినేషన్ లో కూడా కులాంతర వివాహాలకే (దేవుని చిత్తనుసారమైన) ప్రాధాన్యం.
అయితే *భక్తి లోతు లేని మనుష్యలలో కులం పునాదులు ఉన్నట్లయితే వివాహ వ్యవస్థ దెబ్బతింటుంది.*
👉 *దేవుని నామానికి అవమానం కలుగుతుంది.*
👉 కాబట్టి ఈ మధ్యన డినామినేషన్స్ లో కులం అనే భావన తీసుకోలేని వారికి వారి కులం లోనే వివాహాలు చేస్తున్నారు.
నిలబడ గలిగితే దేవుని నామమునకు అవమానం తీసుకుని రాక పోయ్యేటట్లయితే *దేవుని చిత్తాను సారమైన వివాహం (కులం చూడకుండా)* చేసుకోండి.
*కులం అనే కుళ్ళు మనస్సు లో ఉన్నంత వరకు మనం నిజ క్రైస్తవులం కాలేము. ఒక వేళ బలవంతంగా వివాహం చేసినా లేక చేసుకున్నా దేవుని నామానికి అవమానం.*
👉 *వివాహాల దగ్గరే మనకు..*
కులబేధాలు ఉన్నాయో లేదో తేలిపోతుంది.
కులవివక్ష ఉన్నదో లేదో తేలిపోతుంది.
కుల గజ్జి ఉందో లేదో అర్ధమౌతుంది.
👉Intercaste marriage చేసుకోవాలంటే నీకు daring కావాలి.
👉నీ పారంపర్యాచారాలు విడచిపెట్టి, సమాజాన్ని ఎదిరించగలిగే దమ్ము ఉండాలి.
👉బంధువులు, మిత్రులకు ఏమనుకుంటారో అనుకుంటే నీవు క్రైస్తవుడవు కాలేవు.
👉 *క్రైస్తవుల జీవన శైలి వల్ల కుల వివక్ష లేని సమాజం తయారుకావాలి.*
👉 *క్రైస్తవుల వల్ల కులరహిత సమాజం నిర్మించబడాలి.*
👉అటువంటి వాతావరణం క్రీస్తు తన రక్తం ఇచ్చికొన్న సంఘంలో సాధ్యం.
*క్రైస్తవులలో కులభేధాలు కూకటివేళ్ళతో పెకలింపబడాలి.*
*హల్లెలూయ...*
*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*
*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
No comments:
Post a Comment