✳ *విలియం కేరి ఒక అనితరసాధ్యుడు - విలియం కేరీ* ✳
✳ *ఈ రోజు(ఆగస్టు 17) విలియం కేరి గారి పుట్టినరోజు(1761-1834).....*
*జననం* -ఆగష్టు-17-1761
*మరణం* జూన్-9-1834
దేవుని గొప్ప సేవకుడు దైవజనుడు మిషనరిగా మన భారత దేశానికి వచ్చి, క్రీస్తుప్రేమలో ఎన్నో గొప్ప పనులు చేసిన గొప్ప సేవకుడు విలియమ్ కెరీ గారి జన్మించిన రోజు
ప్రపంచ సువార్తీకరణ పట్ల, తన చర్చి పట్టనట్టుగాఉండటాన్ని సహించలేని కేరీ, 1790లో ఒక ఆందోళనచేపట్టాడు. లోకమంతటా సువార్త ప్రకటింపబడాలనిప్రార్ధిస్తూ కూర్చుంటే సరిపోదని కేరీ వాదించాడు. ఏదోఒకటి చేయాలని, ఒక విధి విధానాన్ని అవలంబించాలనిచెబుతూ వచ్చాడు.
1792లో ‘An Enquiry into the Obligations of Christians to Use Means for the Conversion of the Heathens’ అనే పేరుతో ఒక పరిశోదనాత్మకవ్యాసాన్ని ప్రచురించాడు. దేవుని మహిమాయుతప్రణాళిక నెరవేరడానికి మనమూ ఆయనతో చేతులుకలపాలనే భావాన్ని అందులో వ్యక్తం చేసాడు. 'ఆంగ్లభాషలో మిషనరీ పరిచర్యకు సంబంధించినపరిశోధనాత్మక వ్యాసాల్లో ఒక రకంగా అదే మొదటిదీ,నేటికీ అదే గొప్పదీ" అని కేరీ జీవితచరిత్ర రాసిన జార్జ్స్మిత్ పేర్కొన్నాడు.
ఆ వ్యాసానికి అనుసంధానంగా, నాటింగ్ హామ్ లో,బాప్టిస్ట్ సేవకుల సమావేశంలో కేరీ చేసిన ప్రసంగంఅక్షరాలా చారిత్రాత్మకమయ్యింది.
'నీగుడారపుస్థలమునువిశాలపరచుము
నీనివాసస్థలములతెరలునిరాటంకముగాసాగనిమ్ము
నీతాళ్ళనుపొడుగుచేయుమునీమేకులనుదిగగొట్టుము
కుడివైపునకునుఎడమవైపునకునునీవువ్యాపించెదవు
నీసంతానముఅన్యజనులదేశమునుస్వాధీనపరచుకొనును
పాడైనపట్టణములనునివాసస్థలములుగాచేయునుభయపడకుము'
అంటూ యెషయా 54 ఆధారంగా కేరీ చేసిన ప్రసంగం ఒకకొత్త మిషనరీ శకానికి నాంది పలికింది. 'గొప్ప వాటినిదేవుని నుండి ఆశించండి, గొప్పవాటిని దేవుని కోసంచేపట్టండి' అంటూ కేరీ ఎలుగెత్తి చాటాడు.
పర్యవసానంగా కెటరింగ్ అనే ఒక చిన్ని పట్టణంలో మరోసమావేశం జరిగింది. ప్రపంచ సువార్తీకరణ కోసం ఒక మిషనరీ సొసైటీ ఏర్పడింది. అప్పుడు వాళ్ళ వద్దఉన్నది... పదమూడు పౌండ్ల చిల్లర!
🎯 నిజానికి విలియం, జాన్ థామస్ అనే ఇద్దరిని ఇండియాకు మిషనరీలుగా పంపాలని సొసైటీ మొదట నిర్ణయించింది. అయితే, దీనికి సంబంధించి లండన్ లోజరిగిన సమావేశం చివర్లో, స్థానిక భారతీయ భాషల్లోకిబైబిల్ని అనువాదం చేయాలన్న తన కోరికను కేరీవెల్లడించాడు. ఆ సమావేశానికి హాజరైన విలియం వార్డ్అనే ఒక ప్రింటర్, కేరీని కలిసి ఇండియాకు రమ్మనిప్రోత్సహించాడు.
విచిత్రమేమిటంటే, కేరీ అచ్చమైన కాల్వినిస్టు!కాల్వినిస్టులు ప్రిడెస్టినేషన్ అంటూ సువార్త పనినిఅలక్ష్యం చేస్తారనే అభిప్రాయానికి భిన్నంగా కేరీ మిషనరీపరిచర్య పట్ల తీవ్రమైన శ్రద్దా, బాధ్యతా, భారాన్నీప్రదర్శించాడు. మిషనరీ పని చేయాలని వ్యాసాలురాయటం, ప్రసంగాలు చేయటంతో కేరీ ఊరుకోలేదు. 1793 జూన్ 13న తన కుటుంబంతో సహా ఇండియాకుబయలుదేరాడు. దేవునికి స్తోత్రం!
భారత దేశంలో అడుగుపెట్టాక కేరీకి ఎదురైన వ్యతిరేకతఅసాధారణమైంది. బ్రిటీషు పార్లమెంటు, ఈస్ట్ ఇండియాకంపెనీ, మిలటరీ, ప్రాచ్య పండితులు అందరూ తనకువ్యతిరేకమే. విచిత్రంగా తనను పంపిన సొసైటీ బోర్డ్ వారినుంచీ, తను ఏ ప్రజలకు సేవ చేయాలని వచ్చాడో ఆప్రజల నుంచీ కూడా వ్యతిరేకత ఎదురవ్వటంశోచనీయం.
🎯 మిషనరీలు అనగానే పాశ్చాత్య దేశాల సంస్కృతిని వ్యాప్తి చేస్తారనీ, స్థానిక సంస్కృతిని హరించివేస్తారనీ సహజంగా అనుకుంటూ ఉంటారు. అయితే కేరీ మిషనరీపరిచర్యను పరిశీలించిన ఎవరైనా ఆ అభిప్రాయం తప్పుఅని ఒప్పుకుని తీరతారు. భారత దేశంలోని స్థానికసంస్కృతీ, స్థానిక భాషల పరిరక్షణ కోసం కేరీ చేసినంత కృషి, అంతకు మునుపు కానీ, ఆ తర్వాత కానీ, మరేభారతీయుడూ చేయలేదనేది నిర్వివాదాంశం. విలియంకేరీని కేవలం మిషనరీ అంటే సరిపోదు. నేటి క్రైస్తవప్రపంచం కీర్తిస్తున్నట్టుగా 'ఆధునిక ప్రేషితోద్యమపితామహుడు' అనే బిరుదు కూడా ఆయనకు చాలదు.సామాజికంగా ఎదురయ్యే వ్యతిరేకతలు, మతిస్థిమితంలేని భార్య, తరచూ అనారోగ్యం పాలయ్యే పిల్లలు,నిత్యం వెంటాడే ఆర్ధిక ఇబ్బందులు... వీటన్నిటి నడుమకేరీ ఏమి చేసాడో, ఎంత సాధించాడో తెలుసుకుంటేఅవాక్కవుతాం. ఒక సగటు మిషనరీ తన జీవితకాలంలోఇన్ని పనులు ఎలా చేయగలిగాడు అనేది ప్రపంచవ్యాప్తమిషనరీలందరికీ, ఎప్పటికీ ఒక పెద్ద సవాలుగానేఉంటుంది.
👉 కేరీ వృక్షశాస్త్రజ్ఞుడు. ‘ఇంగ్లీష్ డెయ్ జీ’ అనే పూలమొక్కను ఇండియాకు తెచ్చిందీ కేరీయే. తోటపనిలోలినీయన్ (Linnaean) విధానాన్ని భారతదేశానికిపరిచయం చేసాడు. విలియం రాక్స్ బర్గ్ రాసిన బోటనీ ప్రామాణిక గ్రంధం 'ఫ్లోరికా ఇండికా'కు సంపాదకుడు కేరీయే. 'హోర్టాస్ బెంగాలెనిస్' వంటి ఇతర సైన్సు పుస్తకాల్ని కూడా ముద్రించాడు. బోటనీలో కేరీ కృషిని గుర్తిస్తూ ఒక మొక్కకు Careya herbacea అని ఆయన పేరునే పెట్టారు. ఈ సృష్టంతా ఒక మాయో మిథ్యో కాదనీ, ఇది వాస్తవమని, దేవుని చేతి పననీ, దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలనీ ప్రజలకు తెలియ చేయటం కోసం తరచూ సైన్స్ అవగాహనా సదస్సుల్లో మాట్లాడుతుండేవాడు.
🎯 కేరీ సువార్తీకరణ విధానంలో మూడు భాగాలున్నాయి : 1. సువార్త ప్రకటన
2. బైబిల్ అనువాదం
3. స్కూళ్ళ స్థాపన. దాదాపు మూడు వేలసంవత్సరాలుగా భారతీయుల్ని మూఢ నమ్మకాలచీకటిలోనే ఉంచేసిన దుస్థితినీ, విద్య జ్ఞానం అనేవిఅగ్రవర్ణాల వారికి మాత్రమే పరిమితం చేసిన మతసంస్కృతిని కేరీ సహించలేకపోయాడు. నాటివర్ణవ్యవస్థకు చెంపపెట్టుగా, అన్ని కులాల పిల్లలుకలిసి చదువుకునేందుకు వీలుగా, తన మిత్రులతోకలిసి సిరంపూర్ కాలేజ్ ను స్థాపించాడు.ఆసియాలోనే తొలి డిగ్రీ కాలేజ్ గా అది సుప్రసిద్ధం. ఆతర్వాతి ఇరవై ఏళ్ళలో సిరంపూర్ మిషనరీలు 103స్కూళ్ళను తెరిచారు(దాదాపు 7000 విద్యార్ధులు… అదీ, ఆ రోజుల్లో!).
·ఇంగ్లాండ్ లో రాయల్ అగ్రికల్చరల్ సొసైటీస్థాపించడానికి 30 సంవత్సరాలకు ముందే, అంటే1823లో 'అగ్రి-హార్టికల్చర్ సొసైటీ ఆఫ్ ఇండియా'స్థాపించాడు. భారతదేశంలోని వ్యవసాయం గురించిఒక క్రమబద్దమైన రీసర్చ్ చేసి, వ్యవసాయంలోసంస్కరణలు తేవడం కోసం తరచూ 'ఏషియాటిక్రీసర్చేస్' అనే జర్నల్ కి వ్యాసాలు అందించాడు.దాదాపు 60 శాతం అరణ్యంలా మిగిలిఉన్న దేశాన్నిసుభిక్షంగా, సాగు నేలగా చేయటమే కేరీ ఉద్దేశ్యం.
👉 కేరీ అటవీ పరిరక్షకుడు:- భారత దేశంలో అటవీపరిరక్షణ పై రచనలు చేసిన మొట్టమొదటి వ్యక్తికేరీనే. భారతప్రభుత్వం మొట్టమొదటిసారిగామలబార్ లో అటవీ సంరక్షణ చర్యలు చేపట్టడానికి సుమారు 50 ఏళ్ళకు ముందే, కేరీ అటవీ సంరక్షణపైవ్యాసాలు రాసాడు. తన పత్రిక 'ఫ్రెండ్ ఆఫ్ఇండియా'లో రాసిన వ్యాసాలకు స్పందించే,ప్రభుత్వం బర్మా అడవులకు డా.బ్రాండిస్ ను, దక్షిణభారత అడవులకు డా.క్లేఘమ్ ను సంరక్షణపర్యవేక్షకులుగా నియమించింది.
👉 భారతదేశానికి స్టీమ్ ఇంజన్ని మొదటిగా పరిచయం చేసింది కూడా కేరీనే. దాన్ని నమూనాగా తీసుకునిస్థానిక పరికరాలు, వస్తు సామాగ్రితో దేశీ స్టీమ్ఇంజన్ని తయారు చేయమని స్థానిక కమ్మరివారినిప్రోత్సహించాడు.
👉 ప్రచురణ పరిశ్రమల కోసం, దేశీయంగా పేపర్ ని ఉత్పత్తి చేసిన మొదటి వ్యక్తి ఆయనే.
👉 అన్యాయంగా దోచుకునే అధిక వడ్డీ విధానం వాక్యానుసారం కాదని గుర్తెరిగి దాన్ని ఎదుర్కొనేందుకు 'సేవింగ్స్ బ్యాంకు' ఆలోచననుఇండియాకు పరిచయం చేసాడు.
👉 కేరీ రాక ముందు వరకు కుష్టు వ్యాధిగ్రస్తుల్ని సజీవదహనం చేసేవారు. కుష్టువ్యాధి గలవారిని యేసు ప్రేమించాడు. ముట్టుకుని స్వస్థపరిచాడు. కాబట్టి వారిని మనమూ ప్రేమగా చూడాలని, లెప్రసీరోగుల వైద్యం కోసం దేశంలో ఉద్యమించిన మొదటివ్యక్తీ కేరీనే.
👉 భారతదేశపు ప్రింట్ టెక్నాలజీకి పితామహుడు కేరీనే. ఆధునిక ప్రింటింగ్ ని, పబ్లిషింగ్ ని ఇండియాకుతెచ్చింది, నేర్పిందీ, అభివృద్ధి చేసిందీ ఆయనే.ఇండియాలోనే అతి పెద్ద సిరంపూర్ మిషన్ ప్రెస్1800లో స్థాపించాడు. ప్రింటర్లందరూ తమ ఫాంట్లను సిరంపూర్ మిషన్ ప్రెస్ లోనేకొనుక్కునేవారు.
👉 సిరంపూర్ మిషన్ ప్రెస్ లో 1800-1832 కాలంలో 212000 పుస్తకాలు ప్రింటయ్యాయంటే మీరు నమ్మగలరా?
👉 బెంగాలీలో మొదటి గద్య పుస్తకాన్ని కేరీనే ప్రచురించాడు. సంస్కృతంలో మొదట అచ్చువేయబడిన గ్రంధం 'హితోపదేశం' కేరీ వల్లనేసాధ్యమైంది. తన సహచరుడు మార్షల్ తో కలిసిసంస్కృత రామాయణాన్ని, ఆంగ్లంలోకి అనువదించి,ముద్రించాడు.
👉 1818లో వెలువడిన మొదటి ప్రాంతీయ వార్తా పత్రిక 'సమాచార్ దర్పణ్' కేరీ చలవే.
👉 ప్రజాప్రతినిధులు, నాయకుల నాడిని తెలుసుకునేందుకు బెంగాలీలో 'దిగ్దర్శన్' అనేమాసపత్రికను ప్రచురించటం జరిగింది. ఆ రోజుల్లో అదొక సంచలనం.
👉 ఆయన ప్రచురించిన ఆంగ్ల పత్రిక 'ఫ్రెండ్ ఆఫ్ఇండియా' 19వ శతాబ్దం ప్రథమార్ధంలో ఇండియాలోరగులుకున్న సామాజిక చైతన్యానికిమూలకారణమయ్యింది.
👉 కేరీ మంచి భాషావేత్త అని చెప్పనవసరం లేదు. మరాఠా, పంజాబీ, తెలుగు, బెంగాలీ భాషల్లో వ్యాకరణ పుస్తకాలు రాసాడు. ప్రత్యేకంగా బెంగాలీభాషను ఉద్ధరించాడు. దేశంలోనే చక్కని సాహిత్యభాషగా దాన్ని తయారు చేసాడు. 'బంగ్లా అంగ్రేజీఅభిదాన్' అనే బెంగాలీ - ఇంగ్లీష్ డిక్షనరీని కూడాఅందించాడు. బెంగాలీలో క్రైస్తవ భక్తి గీతాలు కూడాకేరీ రచించాడు. కన్నడ, ఒరిస్సా, కాశ్మీరీ, నేపాలీ,గుజరాతీ, అస్సామీ భాషల్లోనూ వ్యాకరణ పుస్తకాలుతేవడానికి కృషి చేసాడు.
👉 "బెంగాలీ భాష పునరుజ్జీవమూ, అభివృద్ధి కోసం ఎంతైతే కృషి జరిగిందో, అదంతా కేరీ, ఆయన సహచరుల వల్లనే జరిగిందని ఒప్పుకోకతప్పదు" అని రవీంద్రనాథ్ టాగూర్ స్వయంగా చెప్పటంలో ఆశ్చర్యం లేదు. బెంగాలీ భాషకు కేరీ చేసిన సేవల్నిగుర్తించి, 1801లో ఫోర్ట్ విలియం కాలేజ్ ఆయన్నిబెంగాలీ ప్రొఫెసర్ నియమించింది. బెంగాలీ తో పాటుఆయన మరాఠీ, సంస్కృత భాషల్నీ బోధించాడు.
👉 కేరీ గొప్ప లెక్సికోగ్రాఫర్(నిఘంటుకారుడు). పండితుల కోసం తొలి సంస్కృత నిఘంటువు రాసి,ప్రచురించాడు. మరాఠీ, బెంగాలీ, భూటాన్ భాషల్లోకూడా నిఘంటువులు చేసాడు.
👉 విలియం కేరీ మహా గొప్ప సంస్కర్త. కేరీ ఇండియాలో అడుగుపెట్టే నాటికి దేశం పరిస్థితి అతి దుర్భరంగాఉంది. ప్రపంచంలోనే అతి దారుణమైనమూఢాచారాలు ఇక్కడున్నాయి. బహుభార్యత్వం, (ఆడ)శిశు హత్యలు, బాల్య వివాహాలు,సతీసహగమనం, ఆడపిల్లలకి చదువు లేకుండాచేయటం మొదలైనవి. విడ్డూరమేమంటే, వీటన్నిటికీహైందవ మతం వత్తాసు పలకటం. ఈదురాచారాలను రూపు మాపేందుకు హైందవసామాజిక అంశాల్నీ, ఆధ్యాత్మిక గ్రంధాల్ని ఒక క్రమబద్దంగా అధ్యయనం చేసి, రచనలు చేసి,ప్రచురించాడు. సామాన్య ప్రజలు నుంచి ప్రభుత్వఅధికారుల వరకు, ఇటు బెంగాల్ మొదలుకుని, అటుఇంగ్లాండ్ వరకు చైతన్యం కలిగించాడు. 'సతి'నిఅరికట్టడానికి పాతికేళ్ళపాటు అవిశ్రాంత పోరాటమేచేసాడు. బాలికల కోసం స్కూళ్ళను తెరిచాడు.విధవలు క్రైస్తవ్యాన్ని స్వీకరించినప్పుడు, వారికిపెళ్ళిళ్ళు జరిపించాడు. ఈ విషయంలో రాజా రామ్మోహన రాయ్, కేశవ్ చంద్ర సేన్ వంటివారికి స్ఫూర్తివిలియం కేరీనే కదా!
👉 తను ఎన్ని రకాల వ్యవహారాలూ, సంస్కరణలూ, సమస్యల్లో తలమునకలవుతున్నా కేరీ తన అసలుపని - దేవుని వాక్యాన్ని స్థానిక భాషల్లోకి అనువదించేపనిని ఎన్నడూ అలక్ష్యం చేయలేదు. బెంగాలీ,ఒరియా, మరాటీ, హిందీ, అస్సామీ, సంస్కృతంభాషల్లోకి బైబిల్ ను స్వయంగా అనువదించాడు.పూర్తిగానో, పాక్షికంగానో, అనువాదమో, ప్రచురణమో,సంపాదకత్వమో ఏ విధంగానైనా కానీ దాదాపు నలభైభాషల్లోకి బైబిల్ రావడం వెనుక కేరీ అవిశ్రాంత కృషిఉంది. కేరీ చేసిన తెలుగు బైబిల్ అనువాదంసిరంపూర్ ప్రెస్ అగ్ని ప్రమాదంలో కాలిపోవటందురదృష్టకరం.
ఇన్ని అసాధారణ విజయాలు సాధించిన కేరీ తనపన్నెండవ ఏటనే స్కూలుకు స్వస్తి చెప్పాడంటేనమ్మగలమా? ఒక చెప్పులు కుట్టుకునేవాడు ఈ దేశాన్నిసమూలంగా ఆధునీకరించడం ఎలా సాధ్యమైంది? 'కేరీఎటువంటివాడంటే, అతడు నాకు బిషప్, ఆర్చ్ బిషప్కంటే గొప్పవాడు. అతడు అపోస్తలుడు' అని ప్రసిద్ధదైవసేవకుడు జాన్ న్యూటన్ అన్నాడంటే కేరీ గొప్పతనాన్ని మనం ఊహించుకోవచ్చు.
ఇంతకీ కేరీ ఎవరు? కేరీని ఏమని సంబోధించాలి?మిషనరీయా? సువార్తికుడా? సంస్కర్తా? పండితుడా?బహుముఖ ప్రజ్ఞాశాలా?
*ఏ టైటిల్ ఆయనకుసరిపోతుంది? మీరన్నా చెప్పగలరేమో ప్రయత్నించండి.....✍*
No comments:
Post a Comment