Monday, 6 August 2018

Bible world records.

*బైబిల్ వరల్డ్ రికార్డ్స్*

ప్రపంచంలో అరుదైన రికార్డులను గ్రంథస్తం చేసే ‘ది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో  బైబిల్ రికార్డుల మోత, ప్రపంచంలో అత్యంత విరివిగా పంపిణీ చేయబడుతున్న, చడవబడుచున్న,అన్ని కాలాల్లో అత్యుత్తమంగా అమ్ముడవుతున్న గ్రంధంగా  రికార్డ్స్ బద్దలుకొట్టిన బైబిల్...

గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ వారి లెక్కల ప్రకారం 1815-1975 మధ్యకాలంలో 250 కోట్ల బైబిల్ గ్రంథాలు ప్రింట్ చేయబడి అమ్ముడయ్యాయి. ప్రపంచ చరిత్రలో ఇంతగా అమ్ముడైనా పుస్తకం మరొకటి లేదు. ఈ విషయాన్ని ‘గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్’ వారు ధృవీకరించారు.

అయినప్పటికీ ప్రపంచంలోని వారందరికీ బైబిల్ అందాలంటే ఇంటర్నేషనల్ బైబిల్ సొసైటీ ఆఫ్ అమెరికా వారి అంచనా ప్రకారం ఇప్పుడు జరుగుతున్న బైబిల్ అనువాదాలు, ముద్రణా, పంపిణీ ప్రకారం చూస్తే పూర్తి ఉత్తర అమెరికా ఖండానికి 13సం.లు పూర్తి దక్షిణ అమెరికా ఖండానికి 16 సం.లు, పూర్తి ఆస్ట్రేలియా ఖండానికి 30 సం.లు, పూర్తి ఆఫ్రికా ఖండానికి 75సం.లు, పూర్తి యూరప్‌ ఖండానికి 90 సం.లు పడుతుందని అంచనా...
(అసియాఖండం లో మత,సామాజిక,  రాజకీయ అస్థిరవ్యవస్థల కారణంగా ఎలాంటి అంచనాలు లేవు...)

5బిలియన్ కాపీలు (500,00,00,000 ఐదువందల కోట్ల కాపీలకు పైగా) అమ్ముడైన పుస్తకంగా రికార్డ్...

బైబిల్ ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతు మరియు అత్యంత విస్తృతంగా పంపిణీ చేయబదుతున్న ఒకే ఒక్క పుస్తకం, ది ఇంటర్నేషనల్ బైబిలు సొసైటీ వారు చేసిన సర్వే ప్రకారం 1815 మరియు 1975 ల మధ్య సుమారు 2.5 బిలియన్ కాపీలు ముద్రించబడిందని తేలింది, ఇటీవలి చేసిన సర్వేలో ఈ సంఖ్య 5 బిలియన్ల కాపీలను దాటిపోయింది.

1995 చివరి నాటికి, నేటి ఆంగ్ల సంస్కరణ (గుడ్ న్యూస్) న్యూ టెస్ట్మెంట్ మరియు బైబిల్ (బైబిల్ సొసైటీలచే నిర్వహించబడిన కాపీరైట్) యొక్క ప్రపంచవ్యాప్త విక్రయాలు 17.75 మిలియన్ కాపీలు దాటాయి...

హీబ్రూ, అరామిక్ మరియు గ్రీకు భాషల బైబిల్ నుంచి అనేక భాషల్లోకి బైబిల్ అనువదించబడింది. అక్టోబరు 2017 నాటికి, పూర్తి బైబిలు 670 ప్రపంచ గుర్తింపు భాషల్లోకి, క్రొత్త నిబంధన 1,521 భాషల్లోకి మరియు 1,121 ఇతర భాషల్లోకి బైబిల్ చిన్న చిన్న భాగాలు లేదా సండే స్కూల్ పిల్లల కోసం కథలుగా అనువదించబడ్డాయి. కనీసం బైబిల్ యొక్క ఒక పుస్తకం (యోహాను సువార్త లాంటివి) 2,883 భాషల్లోకి అనువదించబడ్డాయి.

★డెన్మార్క్‌కు చెందిన మిషనరీ జీజెన్‌బెల్గ్ తమిళ వ్యాకరణాన్ని రచించడంతోపాటు బైబిల్‌ను తమిళంలోకి అనువదించాడు.

★ప్రపంచంలోనే అత్యధిక చర్చిలున్న ప్రాంతం జమైకా దేశంలోని కింగ్స్టన్,1600 చర్చిలతో గిన్నిస్‌ రికార్డుకెక్కింది.

★ప్రపంచంలో క్రైస్తవ్యాన్ని మొదటిసారిగా అధికారిక మతంగా  స్వీకరించిన దేశం ఆర్మేనియా ఇది మన ఆసియా ఖండంలోని దేశమే, క్రీ.శ 3వ శతాబ్దంలో  (క్రీ.శ.301)  ఆర్మేనియా క్రైస్తవ్యన్ని అధికారిక మతంగా స్వీకరించింది...

★ఒకే దేవుని గూర్చి ఒకరికొకరు పరిచయము లేని సుమారు 40 మంది శిష్యులు, ప్రవక్తలు ప్రవచించిన ఏకైక దైవగ్రంథము.

★ప్రపంచంలో అచ్చు యంత్రము ద్వారా ముద్రించబడిన మొట్టమొదటి గ్రంథము (14వ శతాబ్ధం). భారతదేశంలో కూడా మొట్టమొదటగా ముద్రించబడిన గ్రంధం బైబిల్...

★అత్యధిక ప్రాపంచిక భాషలలోకి అనువదించబడిన ఏకైక దైవ గ్రంథము.
(సుమారు 3,000 కు పైగా భాషలు)

★ప్రపంచవ్యాప్తంగా అత్యధికముగా అమ్ముడవుతు, చదవబడుతున్న ఏకైక దైవ గ్రంథము.

★నిజ దేవుని గూర్చి సరైన, సులువైన నిర్వచనము, ఆధారము, అవగాహనను యిచ్చే ఏకైక దైవ గ్రంథము.
(దేవుడు ప్రేమయై యున్నాడు)

★లోకమును ప్రేమించిన, ప్రేమించుచున్న దేవుని గూర్చి వ్రాయబడిన ఏకైక దైవ గ్రంథము. లోకాన్ని ప్రేమించే దేవుడు బైబిల్లో తప్ప మరియే ఇతర దైవ గ్రంథాలలో కనబడడు.

★ప్రపంచంలోని 70% శాతం మంది శాస్త్రవేత్తల చేత అంగీకరింపబడుచున్న ఏకైక దైవ గ్రంథము.

★విశ్వాన్ని గూర్చిన సమాచారాన్ని శాస్త్రవేత్తల కంటే ముందే లోకానికి తెలిపిన ఏకైక దైవ గ్రంథము.

★విద్యుత్ బల్బు తయారు చేసి, ఆ బల్బ్ వెలుగులో చూడబడిన, చదవబడిన మొట్టమొదటి గ్రంథము. బల్బ్ తయారుచేసిన థామస్ ఆల్వ ఎడిసన్ పలికిన మాట, "బైబిల్ నన్ను వెలిగించింది, నేను ప్రపంచాన్ని వెలిగించాను."

★బైబిల్ గ్రంథానికున్నంత మంది బోధకులు మరే ఇతర గ్రంథానికి లేరు.

★బైబిల్ గ్రంథములో ఉన్న సుమారు వెయ్యి పేజీలలో "పరిశుద్ధత" అనే పదము పేజీకి ఒకటి కంటే ఎక్కువ సార్లు వ్రాయబడియున్నది (వెయ్యిని ఎనభై సార్లు). మరే ఇతర దైవ గ్రంథము చదివినా కనీసం వంద పేజీలకు ఒక్కసారి కూడా ఈ పదము కనబడదు. ప్రపంచవ్యాప్తముగా ఎంతగా వాడబడుచున్నదో అంతగా ద్వేషించబడుతున్న గ్రంథము కూడా  బైబిలే... ఎంతగా ద్వేషించబడుతున్నా కాల్చబడుతున్నా చించబడుతున్నా కూడా ద్వేషించుచున్న వారిలో అనేకులను తన వైపునకు తిప్పుకుని తనకు బోధకులుగా చేసికొంటున్న ఏకైన దైవ గ్రంథము బైబిల్.

★భారతదేశంలో కూడా మొట్టమొదటగా ముద్రించబడిన గ్రంధం బైబిల్.

★1821లో, బెంజమిన్ బైలీ అనే మిషనరీ  కేరళలోని మొట్ట మొదటి ముద్రణా యంత్రం C.M.S. ప్రెస్ ను కొట్టాయంలో స్థాపించాడు. అప్పటి నుండి వార్తా పత్రికలూ మరియు గ్రంథ ప్రచురణలలో రాష్ట్రంలో ఈ నగరం ముందంజలో ఉంది.

No comments:

Post a Comment